Stocks to buy today : స్టాక్స్ టు బై.. ఈ రూ. 200 స్టాక్‌ని ట్రాక్ చేయండి- మంచి ప్రాఫిట్స్!
02 July 2024, 9:22 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
నేటి స్టాక్స్ టు బై లిస్ట్..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 443 పాయింట్లు పెరిగి 79,476 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 131 పాయింట్లు పెరిగి 24,141 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 52,575 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. పాజిటివ్‌గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్ ఉంది.
ఈరోజు నిఫ్టీ అవుట్ లుక్‌పై హె్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ.. మార్కెట్ త్వరలోనే 24,400 స్థాయిల తదుపరి లక్ష్యానికి పరుగులు తీస్తోంది. ఈ రోజు నిఫ్టీకి తక్షణ మద్దతు 23,980 స్థాయిలో ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 426.03 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3917.43 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జూన్ నెలలో ఎఫ్ఐఐలు మొత్తం మీద రూ. 2037.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 28,633.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ కారణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా నెలల తర్వాత.. ఒక్క నెలలో భారీగా వృద్ధిచెందాయి.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. డౌ జోన్స్ 0.13శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.27శాతం, నాస్డాక్ 0.83శాతం మేర పెరిగాయి.
స్టాక్స్ టు బై..
బజాజ్ ఫైనాన్స్: రూ.7262 వద్ద కొనండి, టార్గెట్ రూ.7740, స్టాప్ నష్టం రూ.6990.
జేఎస్డబ్ల్యూ స్టీల్: రూ.944 వద్ద కొనండి, టార్గెట్ రూ.1000, స్టాప్ లాస్ రూ.915.
ఆర్‌సిఎఫ్: రూ.197 వద్ద కొనండి, టార్గెట్ రూ.210, నష్టాన్ని ఆపండి రూ.192.
బిర్లా కార్పొరేషన్: రూ.1610 వద్ద కొనండి, టార్గెట్ రూ.1700, స్టాప్ లాస్ రూ.1550.
టైటాన్ కంపెనీ: రూ.3447 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3520, స్టాప్ లాస్ రూ.3400.