తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 230 స్టాక్​లో ట్రేడ్​తో షార్ట్​ టర్మ్​ ప్రాఫిట్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 230 స్టాక్​లో ట్రేడ్​తో షార్ట్​ టర్మ్​ ప్రాఫిట్స్​!

Sharath Chitturi HT Telugu

14 October 2024, 8:15 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​..

స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 230 పాయింట్లు పడి 81,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు పతనమై 24,968 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 358 పాయింట్లు వృద్ధి చెంది 51,172 వద్దకు చేరింది.

“నిఫ్టీ50 25,300 స్థాయిని నిర్ణయాత్మకంగా తిరిగి పొందకపోతే ప్రతికూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ఇది దాని 20 డే ఎక్స్​పొనెన్షియల్​ మూవింగ్ యావరేజ్ (డీఈఎంఏ)ని సూచిస్తుంది,” అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అన్నారు.

నిఫ్టీ50 ఇమ్మీడియేట్​ సపోర్ట్​ 24,700 వద్ద కనిపిస్తుందని, 100 డే ఎక్స్​పొనెన్షియల్ యావరేజ్​ 24,400 వద్ద ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4162.66 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3730.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అక్టోబర్​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 58394.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 57792.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 0.97శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.61శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.33శాతం వృద్ధి చెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సీజీ పవర్​ ఇండస్ట్రియల్​ సొల్యూషన్​ లిమిటెడ్​- బై రూ. 858.15, స్టాప్​ లాస్​ రూ. 828, టార్గెట్​ రూ. 915

మాన్​కైండ్​ ఫార్మా- బై రూ. 2792.5, స్టాప్​ లాస్​ రూ. 2690, టార్గెట్​ రూ. 2950

గెయిల్​ ఇండియా- బై రూ. 230, స్టాప్​ లాస్​ రూ. 223, టార్గెట్​ రూ. 242

పిరమాల్​ ఎంటర్​ప్రైజెస్​ లిమిటెడ్​- బై రూ. 1080, స్టాప్​ లాస్​ రూ. 1050, టార్గెట్​ రూ. 1140

మారికో లిమిటెడ్​- బై రూ. 685, స్టాప్​ లాస్​ రూ. 674, టార్గెట్​ రూ. 710

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

సుదర్శన్ కెమికల్: రూ.1201 వద్ద కొనండి, టార్గెట్ రూ.1290, స్టాప్ లాస్ రూ.1160;

ఉషా మార్టిన్: రూ.422 వద్ద కొనండి, టార్గెట్ రూ.450, స్టాప్ లాస్ రూ.408;

హైటెక్ కార్పొరేషన్: రూ.320.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.340, స్టాప్ లాస్ రూ.309;

న్యూలాండ్ లేబొరేటరీస్: రూ.14247.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.15000, స్టాప్ లాస్ రూ.13700;

బిగ్​బ్లాక్​ కన్​స్ట్రక్షన్స్​: రూ .125.20 వద్ద కొనండి, టార్గెట్ రూ .134, స్టాప్ నష్టం రూ .121.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం