Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈరోజు ఈ 3 స్టాక్స్‌పై ఫోకస్ చేయండి..
13 September 2024, 10:52 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే లిస్ట్..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1440 పాయింట్లు పెరిగి 82,963 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 470 పాయింట్లు వృద్ధి చెంది 25,389 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 762 పాయింట్లు పెరిగి 51,772 వద్దకు చేరింది.
సెప్టెంబర్ 12న నిఫ్టీ50 కీలక రెసిస్టెన్స్‌ని అధిగమించింది.
“నిఫ్టీ 50 రోజువారీ చార్టులో ఇటీవల కన్సాలిడేషన్ నుంచి బయటపడింది. ఇది మంచి విషయం. ఇది పెరుగుదలను సూచిస్తుంది. అదనంగా, ఇండెక్స్ క్లిష్టమైన 21 డే ఈఎంఐ (ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్) కంటే ఎక్కువగా కొనసాగుతోంది. రోజువారీ చార్టులో ఆర్ఎస్ఐ బుల్లిష్ క్రాస్ఓవర్ని చూపిస్తుంది. ఇది సానుకూల సెంటిమెంటని బలపరుస్తుంది. ఇండెక్స్ ఇటీవలి కన్సాలిడేషన్ గరిష్టానికి పైన ముగియడంతో ట్రెండ్ బలంగా ఉంటుంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7695 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1800.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 14236.06 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5458 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 0.58శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.75శాతం వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.98 శాతం లాభపడింది.
స్టాక్స్ టు బై..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్): రూ.130కే కొనొచ్చు. రూ.138 టార్గెట్.. రూ.127 వద్ద స్టాప్ లాస్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ): రూ.173 వద్ద కొనండి. రూ.180 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.169
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( కాంకోర్): రూ .948 వద్ద కొనండి; రూ.1,000 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.933.