Stocks to buy today : ఈ రూ. 170 'బ్రేకౌట్ స్టాక్' కొంటే షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
12 August 2024, 8:15 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 820 పాయింట్లు పెరిగి 70,706 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 251 పాయింట్లు పెరిగి 24,368 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 328 పాయింట్లు పెరిగి 50,485 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 షార్ట్ టర్మ్ ట్రెండ్.. రేంజ్‌బౌండ్‌గా ఉంది. 24,400- 24,450 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీ దానిని అదిగమిస్తే అప్‌ట్రెండ్ ప్రారంభం అవ్వొచ్చు. 24,750 వరకు వెళ్లొచ్చు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 406.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,979.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవావారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.13శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.47శాతం వృద్ధిచెందింది. నాస్డాక్ 0.51శాతం మేర లాభాలను చూసింది.
సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు- స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్లపై ప్రముఖ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి. అదానీ గ్రూప్ స్టాక్స్‌ని ఆర్టిఫీషియల్‌గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్ అఫ్షోర్ ఫండ్స్‌లో మాధవి, ధవల్ బచ్‌లకు వాటాలు ఉన్నట్టు హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం ఉందని వివరించింది. అందుకే అదానీ గ్రూప్‌పై గతేడాది సరిగ్గా విచారణ చేయలేదని పేర్కొంది. కాగా హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను సెబీ చీఫ్, ఆమె భర్త ఖండించారు.
ఈ పూర్తి వ్యవహారంపై స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయి? అనేది ఆసక్తిగా మారింది. కిందటి ఏడాది ఇదే హిండెన్‌బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక దెబ్బకు అదానీ షేర్లు పడిపోయాయి. కోట్లలో నష్టం వచ్చింది. అందుకే ఈ విషయాన్ని ఈజీగా తీసుకోకూడదని కొంతమంది నిపుణుల అభిప్రాయం. ఉదయం ట్రేడింగ్‌లో కొంత బలహీనతను తోసిపుచ్చలేమని అంటున్నారు. మదుపరులు, ట్రేడర్లు అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం సోమవారం ట్రేడింగ్ ప్రారంభ దశల్లో కొంత బలహీనత ఉండవచ్చని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా అన్నారు. ఆ తర్వాత మద్దతుగా మార్కెట్లోకి కొత్త కొనుగోళ్లు తక్కువ స్థాయిలో వస్తాయో లేదో గమనించాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టాక్స్ టు బై..
సంవర్ధన్ మదర్సన్: రూ.187.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.196, స్టాప్ లాస్ రూ.184
ఏబీఎఫ్ఆర్ఎల్: రూ.324.70 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.340, స్టాప్ లాస్ రూ.317
గాబ్రియేల్ ఇండియా: రూ .503.55 వద్ద కొనండి, టార్గెట్ రూ .528, స్టాప్ లాస్ రూ .492
రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ.2948.60 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3100, స్టాప్ లాస్ రూ.2865
టాటా మోటార్స్: రూ.1068.10 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1155, స్టాప్ లాస్ రూ.1025
టెక్ మహీంద్రా లేదా టెక్ఎం: రూ .1506.70 వద్ద కొనండి, టార్గెట్ రూ .1650, స్టాప్ లాస్ రూ .1430
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఎంపీఎస్: రూ.2196 వద్ద, టార్గెట్ రూ.2302, స్టాప్ లాస్ రూ.2115
ట్రెంట్: రూ.6275 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.6600, స్టాప్ లాస్ రూ.6055
స్టెల్ హోల్డింగ్స్: రూ.492.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.515, స్టాప్ లాస్ రూ.474
ఇండో అమైన్స్: రూ.171 వద్ద కొనండి, టార్గెట్ రూ.179, స్టాప్ లాస్ రూ.164
ఆర్కిడ్ ఫార్మా: రూ.1567, టార్గెట్ రూ.1640, టార్గెట్ రూ.1510
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
టాపిక్