Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 88 స్టాక్‌తో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్!
10 September 2024, 8:50 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 81,560 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 84 పాయింట్లు వృద్ధి చెంది 24,936 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 541 పాయింట్లు పెరిగి 51,118 వద్దకు చేరింది.
50 ఇండెక్స్ కీలకమైన 24,900 మార్క్ పైన ముగిసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లో ఇంకా బలం ఉందని నిరూపితమైందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. దలాల్ స్ట్రీట్‌లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో24,750 నుంచి 24,800 జోన్ కీలక సపోర్ట్‌గా చెప్పారు. స్టాక్ స్పెసిఫిక్ విధానాన్ని పాటించాలని, బ్రేకౌట్ స్టాక్స్‌ని చూడటం ట్రేడర్లకు తగిన ఇంట్రాడే ట్రేడింగ్ టిప్ అని ఆయన పేర్కొన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1176.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1757.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 2577.83 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7303.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభాల్లో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- ఒక్క నెలలో 65 శాతం పెరుగుదల.. రాకెట్ వేగంతో దూసుకెళ్లిన స్టాక్.. నిపుణుల అంచనా ఏంటంటే
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయి. డౌ జోన్స్ 1.2శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.16శాతం వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.16 శాతం లాభపడింది.
అమెరికా మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్ (ఈప్యాక్): రూ.281 వద్ద కొనండి. రూ.300 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.270
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ (ఎం అండ్ ఎం): రూ.324 వద్ద కొనండి. రూ.340 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.318.3
అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ (అంబుజాసీఎం): రూ.630 వద్ద కొనండి. లక్ష్యం రూ.660. స్టాప్ లాస్ రూ.615.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
షా అల్లాయ్స్: రూ.82.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.87.50, స్టాప్ లాస్ రూ.79.50
సిన్కామ్ ఫార్ములేషన్స్: రూ.26.77 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.28.50, స్టాప్ లాస్ రూ.25.85
జీపీ పెట్రోలియమ్స్: రూ.87.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.93, స్టాప్ లాస్ రూ.84.50
ఇండో అమైన్స్: రూ.230.38 వద్ద కొనండి, టార్గెట్ రూ.245, స్టాప్ లాస్ రూ.223
టిబిజెడ్: రూ .270.35 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .285, స్టాప్ నష్టం రూ .260