Stocks market news : లోక్‌సభ ఎన్నికల వేళ.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు!
04 June 2024, 9:26 IST
- Stocks market news : లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ.. ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్ మార్కెట్ న్యూస్..
Stocks market news today : లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్ల నష్టంతో 75,166 వద్ద ఉంది. నిఫ్టీ.. 404 పాయింట్లు కోల్పోయి 22,859 వద్ద సెషన్‌ని కొనసాగిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ.. 737 పాయింట్ల నష్టంతో 50,247 వద్ద ఉంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచించారు. బిగినర్లు.. ట్రేడింగ్‌కి దూరంగా ఉండటం శ్రేయస్కరం అని అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ గెలుపు ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 2507 పాయింట్లు పెరిగి 76,469 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 733 పాయింట్లు వృద్ధి చెంది 23,264 వద్ద ముగిసింది. ఇక 1996 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 50,980 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Lok Sabha elections 2024 : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6851 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 1914 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.3శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.1శాతం, నాస్డాక్ 0.56శాతం పెరిగాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy today : రిలయన్స్ ఇండస్ట్రీస్:- బై రూ. 3020.65, స్టాప్ లాస్ రూ. 2900, టార్గెట్ రూ. 3240
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్:- బై రూ. 678.7, స్టాప్ లాస్ రూ. 657, టార్గెట్ రూ. 730
ఎస్ఆర్ఎఫ్:- బై రూ. 2270, స్టాప్ లాస్ రూ. 2210, టార్గెట్ రూ. 2380
యూకో బ్యాంక్:- బై రూ. 62, స్టాప్ లాస్ రూ. 58, టార్గెట్ రూ. 68
జేటీఎల్ ఇండస్ట్రీస్:- బై రూ. 215, స్టాప్ లాస్ రూ. 230, టార్గెట్ రూ. 260
ఎఫ్ఏసీటీ:- బై రూ. 703, స్టాప్ లాస్ రూ. 688, టార్గెట్ రూ. 745
కొచిన్ షిప్‌యార్డ్:- బై రూ. 2010, స్టాప్ లాస్ రూ. 1950, టార్గెట్ రూ. 2130
రెయిల్‌టెల్:- బై రూ. 430, స్టాప్ లాస్ రూ. 418, టార్గెట్ రూ. 455