తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Loksabha Results 2024 : తెలంగాణ లోక్ సభ ఎన్నికలు - ప్రారంభమైన 'కౌంటింగ్'

Telangana Loksabha Results 2024 : తెలంగాణ లోక్ సభ ఎన్నికలు - ప్రారంభమైన 'కౌంటింగ్'

04 June 2024, 8:04 IST

google News
    • Telangana Loksabha Election Results 2024 Live Updates : తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి… ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కించనున్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

Telangana Loksabha Election Results 2024 : తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కించనున్నారు.

తొలి ఫ‌లితం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ వ‌ర‌కు వెలువ‌డే అవ‌కాశం ఉంది. తుది ఫ‌లితం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. తొలి ఫ‌లితం నిజామాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌ వ‌ర్గంలో వెలువ‌డ‌నుంది.

క‌రీంన‌గ‌ర్, న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాలు చివ‌ర‌లో వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఈ నియోజ‌క‌ వ‌ర్గాల్లో 24 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చారు.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా రౌండ్ల వివ‌రాలు :

  • ఆదిలాబాద్ – 23
  • పెద్ద‌ప‌ల్లి – 21
  • క‌రీంన‌గ‌ర్ – 24
  • నిజామాబాద్ – 15
  • జ‌హీరాబాద్ – 23
  • మెద‌క్ – 23
  • మ‌ల్కాజ్‌గిరి – 21
  • సికింద్రాబాద్ – 20
  • హైద‌రాబాద్ – 24
  • చేవెళ్ల – 23
  • మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ – 21
  • నాగ‌ర్‌క‌ర్నూల్ – 22
  • న‌ల్ల‌గొండ – 24
  • భువ‌న‌గిరి – 23
  • వ‌రంగ‌ల్ – 18
  • మ‌హ‌బూబాబాద్ – 22
  • ఖ‌మ్మం – 21

తదుపరి వ్యాసం