Telangana Loksabha Election Results 2024 Live Updates : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు - సత్తా చాటిన బీజేపీ
- Telangana Loksabha Election Results 2024 Live Updates : తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు. మెజార్టీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది…
Tue, 04 Jun 202411:28 AM IST
పార్టీల వారీగా సంఖ్య
బీజేపీ - 8 పార్లమెంట్ స్థానాలు
కాంగ్రెస్ - 8 సీట్లు
ఎంఐఎం - 1
బీఆర్ఎస్ - 0
Tue, 04 Jun 202411:24 AM IST
డీకే అరుణ గెలుపు
మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు
Tue, 04 Jun 202411:10 AM IST
బీఆర్ఎస్ ఖాతాలోకి చెత్త రికార్డు
టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల వరకు చూస్తే సీట్లు గెలుస్తూ వచ్చింది. కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవటం ఇదే తొలిసారి. పార్టీ పరాజయంపై కేటీఆర్ స్పందిస్తూ.. ఫలితాలు నిరాశ కలిగించాయని ట్వీట్ చేశారు. భవిష్యత్తులో పార్టీ విజయం కోసం శ్రమిస్తూ… ఫినిక్స్ పక్షి మాదిరిగా మళ్లీ పైకి లేస్తామని అని రాసుకొచ్చారు.
Tue, 04 Jun 202410:52 AM IST
8 - 8
కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒక స్థానంలో పాగా వేయనుంది. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాలేని పరిస్థితి నెలకొంది.
Tue, 04 Jun 202410:07 AM IST
ఈటల రాజేందర్ విజయం
మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3 లక్షలకుపైగా మెజార్టీ విజయం సాధించారు.
Tue, 04 Jun 202409:51 AM IST
ఆధిక్యంలో రఘనందన్
మెదక్ లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు. 30వేలకు పైగా ఆధిక్యంలో ఉండగా… బీఆర్ఎస్ అభ్యర్థి మూడోస్థానంలో ఉన్నారు.
Tue, 04 Jun 202409:50 AM IST
డీకే అరుణ ఆధిక్యం
మహబూబ్ నగర్ లో 6262 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ
Tue, 04 Jun 202408:54 AM IST
బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా..?
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి కనిపించటం లేదు. బీజేపీ, కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు దక్కే అవకాశం ఉంది.
Tue, 04 Jun 202408:37 AM IST
విజయం దిశగా ఈటల రాజేందర్
మల్కాజ్ గిరి ఈటల రాజేందర్ 2 లక్షలకుపైగా మెజార్టీతో దూసుకెళ్తున్నారు. దాదాపు ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంది.
Tue, 04 Jun 202408:29 AM IST
5 లక్షలకుపైగా మెజార్టీ…
నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి 5,25362 మెజారిటీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
Tue, 04 Jun 202408:21 AM IST
భువనగిరిలో కాంగ్రెస్ విజయం
భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
Tue, 04 Jun 202407:58 AM IST
ఖమ్మంలో కాంగ్రెస్ విజయం
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామి రెడ్డి భారీ విజయం సాధించారు. 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు.
Tue, 04 Jun 202407:42 AM IST
భారీ ఆధిక్యంలో బండి సంజయ్
కరీంనగర్ లో 12 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 1,38,616ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 3,31,529
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,92,913
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ - 157061
Tue, 04 Jun 202407:29 AM IST
పత్తాలేని బీఆర్ఎస్…!
తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. అయితే బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయింది.
Tue, 04 Jun 202407:18 AM IST
భారీ మెజార్టీ దిశగా నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ దిశగా వెళ్తున్నారు.
Tue, 04 Jun 202406:55 AM IST
ఓట్ల శాతం
తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల ఫలితాలను చూస్తే కాంగ్రెస్ కూ 40.5%, బీజేపీకి 34.5%, బీఆర్ఎస్ కు 17.4% ఓట్ల శాతం దక్కింది.
Tue, 04 Jun 202406:53 AM IST
ఆధిక్యాల వివరాలు
సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యంలో ఉంది. మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 వేల ఓట్ల లీడ్, హైదరాబాద్‌లో 59 వేల ఆధిక్యంలో ఎంఐఎం, వరంగల్‌లో 92,726 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య ఉన్నారు. భువనగిరిలో లక్షా 6 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్, చేవెళ్లలో 70 వేల ఓట్ల లీడ్‌లో బీజేపీ, జహీరాబాద్‌లో 17 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, పెద్దపల్లిలో 50 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్, నిజామాబాద్‌లో 39 వేల ఆధిక్యంలో బీజేపీ, నాగర్‌కర్నూల్‌లో 28 వేల ఆధిక్యంలో కాంగ్రెస్, కరీంనగర్‌లో లక్షా 13 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, ఖమ్మంలో 2.66 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు.
Tue, 04 Jun 202406:27 AM IST
కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్న స్థానాలు
పెద్దపల్లి
జహీరాబాద్
వరంగల్
మహబూబాబాద్
ఖమ్మం
భువనగిరి
నల్గొండ
నాగర్ కర్నూలు
Tue, 04 Jun 202406:26 AM IST
బీజేపీ లీడింగ్ లో ఉన్న స్థానాలు
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, మహబూబ్ నగర్
Tue, 04 Jun 202406:15 AM IST
మెదక్ లో బీజేపీకి ఆధిక్యం
మెదక్ లోక్ సభ ఫలితాల తాజా సమాచారం ప్రకారం…బీజేపి 6408 ఓట్ల ఆదిక్యంలో ఉంది.
- బీజేపీ - 153075
బిఆర్ఎస్ -146667
కాంగ్రెస్ - 139122
Tue, 04 Jun 202406:01 AM IST
మెదక్ లో త్రిముఖ పోటీ
మెదక్ పార్లమెంటు ఐదో రౌండ్ పూర్తి అయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థికి 850 ఓట్ల లీడ్ దక్కింది.
కాంగ్రెస్. - 102087
బిజెపి. - 106775
బిఅర్ఎస్ - 107625
ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి బిఆర్ ఎస్ లీడ్ - 850
Tue, 04 Jun 202405:43 AM IST
బండి సంజయ్ కు భారీ ఆధిక్యత
కరీంనగర్ లో 6 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 76,437 ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు.
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 1,70,383
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 93,946
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 79,520
Tue, 04 Jun 202405:29 AM IST
పెద్దప్లలిలో కాంగ్రెస్ కు లీడ్
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో 4 వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 18,518 ఓట్ల ఆధిక్యత దక్కింది.
కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణ -98274
బిజేపి గోమాసె శ్రీనివాస్ -79756
బిఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ -36458
Tue, 04 Jun 202405:25 AM IST
మెదక్ లో ఆధిక్యంలో బీజేపీ
మెదక్ మూడో రౌండ్ ఓవరాల్ గా ముగిసే సమయానికి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది.మూడో రౌండ్ ముగిసే సరికి 1731 ఓట్ల ముందంజలో BJP అభ్యర్థి రఘునందన్ రావు ఉన్నారు.
INC- 63273
BRS- 63655
BJP- 65386
Tue, 04 Jun 202405:05 AM IST
మెదక్ లో బీఆర్ఎస్ కు లీడ్
మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలో బీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యతను కనబరుస్తోంది. ప్రస్తుతం 720 ఓట్ల లీడ్ తో వెంకట్రామిరెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు.
Tue, 04 Jun 202405:04 AM IST
దూసుకెళ్తున్న బండి సంజయ్
కరీంనగర్ లో మూడో రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 39313 ఓట్ల ఆధిక్యతను దక్కించుకున్నారు.
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 86447
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 47134
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 39228
Tue, 04 Jun 202404:48 AM IST
ఈటలకు భారీ ఆధిక్యం
మల్కాజ్ గిరి పార్లమెంట్ రెండవ రౌండ్ ఓట్ల లెక్కింపులో 39,785 ఓట్ల ముందుంజలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు.
బీజేపీ -101982
కాంగ్రెస్ - 62197
బీఆర్ఎస్ - 33097
Tue, 04 Jun 202404:46 AM IST
జహీరాబాద్ లో కాంగ్రెస్ కు లీడ్
జహీరాబాద్ లో మూడవ రౌండ్ ఓవరాల్ గా ముగిసే సరికి 10 వేల 79 ఓట్ల తేడాతో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఉన్నారు.
బీజేపీ-67592
కాంగ్రెస్- 77671
BRS- 25068
Tue, 04 Jun 202404:38 AM IST
2చోట్ల బీఆర్ఎస్ కు ఆధిక్యం
మెదక్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు.
Tue, 04 Jun 202404:32 AM IST
వరంగల్ లో కాంగ్రెస్
వరంగల్ డో రౌండ్ ఫలితాలు వచ్చే సరికి 18,498 ఓట్ల మెజార్టీ ఆధిక్యంలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. రెండో ప్లేస్ లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, మూడో ప్లేస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఉన్నారు.
Tue, 04 Jun 202404:24 AM IST
జహీరాబాద్ లో కాంగ్రెస్ కు లీడ్
జహీరాబాద్ మొదటి రౌండ్ ఓవరాల్ గా పూర్తి అయ్యే సరికి 3343 ఓట్ల తేడాతో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఉన్నారు.
Tue, 04 Jun 202404:22 AM IST
చేవెళ్లలో బీజేపీకి లీడ్
చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది. శేర్లింగంపల్లి అసెంబ్లీ పరిధిలో 2nd Round ముగిసే సమయానికి అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:- 3933
బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:- 23394
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:- 9225
ముందంజలో దూసుకుపోతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి 14169ఆధిక్యం
Tue, 04 Jun 202404:18 AM IST
బండి సంజయ్ కు 15వేలకు పైగా లీడ్
కరీంనగర్ లో మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 15362 లీడ్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఉన్నారు.
Tue, 04 Jun 202404:03 AM IST
భువనగిరిలో కాంగ్రెస్ కు లీడ్
భువనగిరి రెండవ రౌండ్ ముగిసేసరికి 4500 ఓట్ల ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Tue, 04 Jun 202403:59 AM IST
వరంగల్ లో కాంగ్రెస్ కు లీడ్
వరంగల్ పార్లమెంట్ స్థానం మొదటి రౌండ్ ఫలితాలు
బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్: 21,719
కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య: 30,123
బీఆర్ఎస్ అభ్యర్థి మారపెళ్లి సుధీర్ కుమార్: 14,683
కాంగ్రెస్ లీడ్: 8404
Tue, 04 Jun 202403:52 AM IST
ఖమ్మంలో కాంగ్రెస్ కు భారీ లీడ్
ఖమ్మం 2 వ రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి లో 26,000 లీడ్ లో ఉన్నారు.
Tue, 04 Jun 202403:49 AM IST
పెద్దపల్లిలో కాంగ్రెస్ కు లీడ్
పెద్దపల్లి లోక్‌సభ స్థానం..
బెల్లంపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 1వ రౌండ్ పూర్తి..
గోమాస శ్రీనివాస్ (బీజేపీ) : 1,753
గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) : 3,499
కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్) : 1,590
1,746 ఓట్లతో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ..
Tue, 04 Jun 202403:42 AM IST
మెదక్ లో బీజేపీకి లీడ్
మెదక్ పార్లమెంట్ మొదటి రౌండ్లో బీజేపీ మాధవనేని రఘునందన్ రావు 800 ఓట్ల తో ఆధిక్యం దక్కింది.
బీజేపీ :-3515
కాంగ్రెస్ :2740
బిఆర్ఎస్ :2425
Tue, 04 Jun 202403:37 AM IST
ఖమ్మంలో కాంగ్రెస్ కు లీడ్
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘు రాం రెడ్డి కి 19,935 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Tue, 04 Jun 202403:31 AM IST
వరంగల్ బీజేపీ అభ్యర్థికి లీడ్
వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ కు 200 ఓట్ల లీడ్ దక్కింది.
Tue, 04 Jun 202403:31 AM IST
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్
నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘవీర్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
Tue, 04 Jun 202403:27 AM IST
భువనగిరిలో ఇలా…
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు , భువనగిరిలో బిజెపి లీడింగ్ ఉంది.
ఇబ్రహీంపట్నం, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి, జనగాం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
Tue, 04 Jun 202403:19 AM IST
మల్కాజ్ గిరిలో ఈటల కు లీడ్
ముషీరాబాద్ నియోజకవర్గం AV కాలేజీ లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.
బీజేపీ - 4733
కాంగ్రెస్ - 1318
బీఆర్ఎస్ - 1097
3325 ఓట్ల లీడ్ లో బీజేపీ
Tue, 04 Jun 202403:18 AM IST
బీజేపీ లీడింగ్ ఉన్న స్థానాలు
కరీంనగర్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది.
Tue, 04 Jun 202403:17 AM IST
5 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
తెలంగాణలోని 17 స్థానాల్లో చూస్తే 5 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క స్థానంలో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది.
Tue, 04 Jun 202403:14 AM IST
ఆదిలాబాద్ లో బీజేపీకి ఆధిక్యం
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి 605 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్: 3,297, బిజెపి : 3902, బిఆర్ఎస్ : 859 ఓట్ల దక్కాయి.
Tue, 04 Jun 202403:12 AM IST
పెద్దపల్లిలోకాంగ్రెస్ ముందంజ
పెద్దపల్లిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు 816 ఓట్ల ఆధిక్యం లభించింది.
Tue, 04 Jun 202403:11 AM IST
బీజేపీకి 6330 ఓట్ల ఆధిక్యం
మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్ల తో ఆధిక్యం దక్కింది.
బీజేపీ :-8811
కాంగ్రెస్ :2581
బిఆర్ఎస్ :1418
Tue, 04 Jun 202403:09 AM IST
ఆధిక్యంలో ఈటల రాజేందర్….
మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు భారీ ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 6వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Tue, 04 Jun 202403:07 AM IST
డీకే అరుణకు ఆధిక్యం…
మహబూబ్‌నగర్‌లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు లీడ్ వచ్చింది.
Tue, 04 Jun 202403:06 AM IST
ఆదిలాబాద్ లో బీజేపీకి లీడ్
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేశ్ కు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు.
Tue, 04 Jun 202403:02 AM IST
ముందంజలో బండి సంజయ్….
కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు.
Tue, 04 Jun 202402:40 AM IST
లెక్కింపు ప్రారంభం
తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Tue, 04 Jun 202402:31 AM IST
ప్రారంభమైన కౌంటింగ్
తెలంగాణలోని లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు.
Tue, 04 Jun 202402:00 AM IST
కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం….
కాసేపట్లో తెలంగాణలో లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంఓభం కానుంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. దీని ప్రకారం.. ట్రెండ్స్ షురూ కానున్నాయి.
Tue, 04 Jun 202401:38 AM IST
2019 ఎన్నికల ఫలితాలు…
2019 ఎన్నికల ఫలితాలను చూస్తే… కాంగ్రెస్ 3, బీజేపీ 4 స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఒక్క స్థానాన్ని నిలబెట్టుకుంది.
Tue, 04 Jun 202401:21 AM IST
8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు.
Tue, 04 Jun 202401:03 AM IST
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…!
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం… తెలంగాణలోని బీజేపీ 8- 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పలు సంస్థలు చెప్పాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లోపు గెలవొచ్చని అంచనా వేశాయి. ఇక బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కపోవచ్చని తెలిపాయి.
Tue, 04 Jun 202412:58 AM IST
పలుచోట్ల టఫ్ ఫైట్….
తెలంగాణోలని 17 లోక్‌సభ స్థానాల్లో పలు చోట్ల ముఖాముఖి పోటీ జరగ్గా.. మరికొన్ని స్థానాల్లో త్రిముఖ పోరు సాగింది. దీంతో ఆయా చోట్ల ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
Tue, 04 Jun 202412:58 AM IST
ఆసక్తికర పోరు…!
కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.పద్మారావు పోటీ చేశారు. ఇక మల్కాజ్ గిరి పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బీజేపీ తరపున ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ కు బలమైన స్థానం మెదక్‌లో పోరు అత్యంత ఆసక్తికరంగా జరగడంతో ఈ ఫలితంపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Tue, 04 Jun 202412:48 AM IST
నేతల ధీమా…
మెజార్టీ సీట్లలో పాగా వేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈసారి తమదే టాప్ ప్లేస్ అని బీజేపీ నేతలు అంటున్నారు.
Tue, 04 Jun 202412:48 AM IST
బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది…?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ డీలా పడిపోయింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలవబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Tue, 04 Jun 202412:46 AM IST
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్…!
తెలంగాణలోని లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా - నేనా అన్నట్లు పరిస్థితి ఉండొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
Tue, 04 Jun 202412:36 AM IST
నియోజక వర్గాల వారీగా రౌండ్ల వివరాలు :
ఆదిలాబాద్ – 23
పెద్దపల్లి – 21
కరీంనగర్ – 24
నిజామాబాద్ – 15
జహీరాబాద్ – 23
మెదక్ – 23
మల్కాజ్‌గిరి – 21
సికింద్రాబాద్ – 20
హైదరాబాద్ – 24
చేవెళ్ల – 23
మహబూబ్ నగర్ – 21
నాగర్‌కర్నూల్ – 22
నల్లగొండ – 24
భువనగిరి – 23
వరంగల్ – 18
మహబూబాబాద్ – 22
ఖమ్మం – 21
Tue, 04 Jun 202412:35 AM IST
చివర్లో వచ్చే ఫలితాలు…
కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ నియోజక వర్గాల ఫలితాలు చివరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నియోజక వర్గాల్లో 24 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.
Tue, 04 Jun 202412:34 AM IST
తొలి ఫలితం నిజామాబాద్ దే…!
తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితం సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. తొలి ఫలితం నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో వెలువడనుంది.
Tue, 04 Jun 202412:34 AM IST
ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.
Tue, 04 Jun 202412:10 AM IST
అమల్లో 144 సెక్షన్…
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.
Tue, 04 Jun 202412:06 AM IST
గత నెల 13న పోలింగ్
గత నెల 13న తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను పోలింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది.
Tue, 04 Jun 202412:03 AM IST
బరిలో 525 మంది అభ్యర్థులు….
తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు.
Tue, 04 Jun 202412:02 AM IST
నేడే తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు.