తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mutual Funds : ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10 వేల నెలవారీ పెట్టుబడితో కోటి రూపాయల వరకు రిటర్న్!

Mutual Funds : ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10 వేల నెలవారీ పెట్టుబడితో కోటి రూపాయల వరకు రిటర్న్!

Anand Sai HT Telugu

02 December 2024, 9:12 IST

google News
    • SBI Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులను అందిస్తాయి. కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఊహించని లాభాలు ఇస్తాయి. అలాంటి వాటిలో ఎస్బీఐకి చెందినవి కూడా ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి (Unsplash)

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి

ఎస్బీఐకి చెందిన వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్.. ఇటీవలి కాలంలో బాగా పనిచేశాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ భారతదేశంలో చాలా ఏళ్లుగా ఉంది. దీనికింద అనేక రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉన్నాయి. వీటిలో చాలా ఫండ్స్ గతంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. కొన్ని సంవత్సరాలలో రూ.10,000 నుంచి రూ.1 కోటి వరకు నెలవారీ SIPని అందించే ఫండ్‌ల గురించి చుద్దాం..

ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్

ఈ ప్లాన్ సాధారణ పథకం గత ఒక సంవత్సరంలో 28.71 శాతం రాబడిని ఇచ్చింది. పదేళ్లలో 21.24 శాతం రాబడిని ఇచ్చింది. 15 సంవత్సరాలలోచూస్తే రూ. 10,000 SIP 23.19 శాతం వార్షిక రాబడితో రూ. 1,26,73,965కి పెరిగింది.

ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్

ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఒక సంవత్సరంలో 40.70 శాతం రాబడిని ఇచ్చింది. పదేళ్లలో 14.65 శాతం తెచ్చింది. 10,000 రూపాయల సిప్ పెట్టుబడి గత 15 సంవత్సరాలలో 17.01 శాతం వార్షిక రాబడితో 73,47,727 రూపాయలకు పెరిగింది.

ఎస్బీఐ కాంట్రా ఫండ్

ఈ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గత ఏడాదిలో 30.94 శాతం రాబడిని ఇచ్చింది. పదేళ్లలో 13.36 శాతం రాబడినిచ్చింది. 15 ఏళ్లలో రూ. 10,000 సిప్ 17.56 శాతం వార్షిక లాభంతో రూ.77,09,485కి పెరిగింది.

ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్

ఈ ఫండ్ గత సంవత్సరంలో 32.35 శాతం రాబడిని ఇచ్చింది. గత పదేళ్లలో 16.28 శాతం రాబడిని తెచ్చింది. 15 సంవత్సరాలలో రూ. 10,000 సిప్ ఇన్వెస్ట్‌మెంట్ 16.72శాతం వార్షిక రాబడితో రూ.71,59,243కి పెరిగింది.

ఎస్బీఐ టెక్నాలజీస్ ఆపర్చునిటీస్ ఫండ్స్

ఈ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గత ఏడాదిలో 35.56శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో గత 10 సంవత్సరాలలో 16.28 శాతం రాబడిని అందించింది. 15 సంవత్సరాలలో చూసుకుంటే రూ. 10,000 సిప్ 19.43 శాతం వార్షిక రాబడితో రూ.90,85,892కి పెరిగింది.

ఎస్బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీ ఫండ్

ఈ ప్లాన్ గత ఏడాదిలో 42.23 శాతం రాబడిని తీసుకొచ్చింది. అదే సమయంలో పదేళ్లలో 13.36 శాతం రాబడిని ఇచ్చింది. 15 సంవత్సరాలలో రూ. 10,000 సిప్ 17.90 శాతం వార్షిక రాబడితో రూ.79,40,582కి పెరిగింది.

గమనిక : మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడి అనేది మారుతూ ఉంటుంది. గత కొన్నేళ్లలో వచ్చిన రాబడులు భవిష్యత్తులో రావొచ్చు, రాకపోవచ్చు. నిపుణుల సలహా మేరకు ఇన్వెస్ట్ చేయండి.

తదుపరి వ్యాసం