Samsung Galaxy S23 FE : శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ.. లాంచ్ ఎప్పుడు?
28 May 2023, 13:39 IST
- Samsung Galaxy S23 FE : గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈని లాంచ్ చేసేందుకు శామ్సంగ్ ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ చూద్దాము..
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ..
Samsung Galaxy S23 FE : గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈని లాంచ్ చేసేందుకు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5, ఫ్లిప్5 మోడల్స్ తర్వాత ఈ గ్యాడ్జెట్ మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ..
ప్రీమియం సెగ్మెంట్లోని గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్స్‌పై కస్టమర్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. రానున్న త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కాస్త చౌకైన ధరలో గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈని శామ్సంగ్ తీసుకురావాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ డివైజ్.. యూరోప్‌లో టెస్టింగ్ దశలో ఉన్నట్టు వెల్లడించాయి. అమెరికా, సౌత్ కొరియా వర్షెన్లపై టెస్టింగ్ ఇంకా మొదలవ్వలేదని పేర్కొన్నాయి.
ఈ ఎస్23 ఎఫ్ఈ.. ఎస్23కి బడ్జెట్ ఫ్రెండ్లీ వర్షెన్‌గా ఉండనుంది. హార్డ్‌వేర్‌లో స్వల్ప మార్పులు కనిపించొచ్చు. ఇక ఈ డివైజ్‌లో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ68 రేటెడ్ ప్రొటెక్షన్, కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్లు ఉంటాయని అంచనాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:- Samsung Galaxy S23 Ultra: 200MP కెమెరా సహా ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా వచ్చేసింది
120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇందులో ఉండొచ్చు. రర్లో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. రెండ కలర్ ఆప్షన్స్‌లో లభించొచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ- ఫీచర్స్..!
Samsung Galaxy S23 FE features : ఇక ఇందులో ఎక్సినోస్ 2000 చిప్సెట్ ఉండొచ్చు. గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో ఇదే ఉంది. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత యూఐ 5.1 సాఫ్ట్వేర్ ఇందులో ఉండొచ్చు. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 23వాట్ వయర్డ్, 15వాట్ వయర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి లభించే అవకాశం ఉంది.
ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ లాంచ్ డేట్, ధర వంటి వివరాలపై రానున్న రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.