Samsung Galaxy F14: స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ తో సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 లాంచ్
02 August 2024, 21:07 IST
స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14ను భారత్ లో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 లాంచ్
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. సమర్థవంతమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్తో మరింత మెరుగైన సర్వీస్ ను అందించాలన్న లక్ష్యంతో ఈ గెలాక్సీ ఎఫ్14 స్మార్ట్ ఫోన్ (Smart phone) ను శాంసంగ్ లాంచ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 లో మెరుగైన పనితీరు, స్మూత్ మల్టీటాస్కింగ్ కోసం స్నాప్ డ్రాగన్ 680 చిప్ ను అమర్చారు. ఇది 8 జీబీ వరకు ర్యామ్ ను అందిస్తుంది. మెరుగైన యాప్ మేనేజ్మెంట్ కోసం ర్యామ్ ప్లస్ ఫీచర్ ను కూడా అందిస్తోంది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
కెమెరా విభాగంలో, ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 స్మార్ట్ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ లెన్స్ లో-లైట్ ఫోటోగ్రఫీ కోసం ఎఫ్ 1.8 ఎపర్చర్ ను కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది వైవిధ్యమైన ఫోటోగ్రఫీ అవసరాల కోసం అధిక-నాణ్యత గల సెల్ఫీలను సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 (Samsung Galaxy F14) లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ రెండు జనరేషన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కోసం నాలుగేళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందిస్తుంది. అదనపు భద్రత కోసం ఈ పరికరంలో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14: ధర, లభ్యత
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 మూన్ లైట్ సిల్వర్, పిప్పరమింట్ గ్రీన్ రంగులలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా దీన్ని విక్రయిస్తామని, ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చని శాంసంగ్ తెలిపింది.