Samsung Galaxy F14 5G Sale: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్ ఫస్ట్ సేల్ నేడే.. 6,000mAh బ్యాటరీతో: ధర ఎంతంటే!-samsung galaxy f14 5g first sale today check price specifications offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy F14 5g First Sale Today Check Price Specifications Offers

Samsung Galaxy F14 5G Sale: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్ ఫస్ట్ సేల్ నేడే.. 6,000mAh బ్యాటరీతో: ధర ఎంతంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 30, 2023 10:09 AM IST

Samsung Galaxy F14 5G Sale Today: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ నేడు (మార్చి 30) తొలిసారి సేల్‍కు రానుంది. 6,000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో బడ్జెట్ రేంజ్‍లో ఈ మొబైల్ వస్తోంది.

Samsung Galaxy F14 5G Sale: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్ ఫస్ట్ సేల్ నేడే (Photo:Samsung)
Samsung Galaxy F14 5G Sale: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్ ఫస్ట్ సేల్ నేడే (Photo:Samsung)

Samsung Galaxy F14 5G Sale Today: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ సేల్‍కు సిద్ధమైంది. ఇటీవల లాంచ్ అయిన ఈ బడ్జెట్ 5జీ మొబైల్ నేడు (మార్చి 30) తొలిసారి సేల్‍కు వస్తోంది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. తొలి సేల్ సందర్భంగా బ్యాంక్ కార్డు ఆఫర్లు ఉంటాయి. 6000mAh బ్యాటరీ, ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్‍కు హైలైట్లుగా ఉన్నాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ పూర్తి వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్లు

Samsung Galaxy F14 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్‍‍లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍ యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. ఈ ఫోన్‍కు మరో రెండు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‍డేట్లు ఇవ్వనున్నట్టు సామ్‍సంగ్ పేర్కొంది. 13 5జీ బ్యాండ్లకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy F14 5G Display: 6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను ఈ మొబైల్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ మొబైల్‍లో 6,000mAh బ్యాటరీ ఉంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్‌ను ఈ మొబైల్‍కు ఇచ్చింది సామ్‍సంగ్.

Samsung Galaxy F14 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ధర, సేల్, ఆఫర్లు

Samsung Galaxy F14 5G Price: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,490గా ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.15,990గా ఉంది. అయితే, ఫస్ట్ సేల్‍లో హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‍ను కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు పొందవచ్చని సామ్‍సంగ్ పేర్కొంది. అంటే బేస్ వేరియంట్‍ను రూ.12,990, టాప్ వేరియంట్‍ను రూ.14,490కు దక్కించుకోవచ్చని తెలిపింది. నేటి (మార్చి 30) మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart), సామ్‍సంగ్ (samsung.com) అధికారిక వెబ్‍సైట్‍లో సేల్ మొదలవుతుంది. ఓఎంజీ బ్లాక్, జీఓఏటీ గ్రీన్, బీఏఈ పర్పుల్ కలర్ ఆప్షన్‍లలో Samsung Galaxy F14 5G లభిస్తుంది.

WhatsApp channel