తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Shotgun 650 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650.. ఇలా ఉంటుంది!

Royal Enfield Shotgun 650 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650.. ఇలా ఉంటుంది!

Sharath Chitturi HT Telugu

22 September 2023, 14:29 IST

google News
    • Royal Enfield Shotgun 650 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650 బైక్​కు సంబంధించిన కొన్ని ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..
రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650.. ఇలా ఉంటుంది!
రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650.. ఇలా ఉంటుంది! (Representative image)

రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650.. ఇలా ఉంటుంది!

Royal Enfield Shotgun 650 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​.. షార్ట్​గన్​ 650 అనే పేరుతో ఓ కొత్త బైక్​ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మోడల్​కు సంబంధించిన కొన్ని వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వాటిని ఇక్కడ చూద్దాము..

కొత్త బైక్​ విశేషాలివే..!

ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650.. సూపర్​ మీటియర్​ 650 కన్నా వెడల్పు తక్కువ, ఎత్తు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బైక్​ పొడవు 2,170ఎంఎం. వెడల్పు 820ఎంఎం. ఎత్తు 1,105ఎంఎంగా ఉంటుందని తెలుస్తోంది. వీల్​బేస్​ వచ్చేసి 1,465గా ఉంటుందని సమచారం. ఈ బైక మొత్తం బరువు 428కేజీలని తెలుస్తోంది.

ఇందులో ఎల్​ఈడీ లైయింట్​, అప్​సైడ్​ డౌన్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, ట్విన్​ సైడెడ్​ రేర్​ షాక్​అబ్సార్బర్స్​ వంటివి వస్తాయని తెలుస్తోంది. ఇక ఈ బైక్​లో డ్యూయెల్​ ఎక్సాస్ట్​ పైప్స్​, మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, ఫ్రెంట్​- రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​, బ్లాక్​ అలాయ్​ వీల్స్​, స్ప్లిట్​ గ్రాబ్​ రెయిల్స్​ వస్తాయని సమాచారం. ఈ మోడల్​లో 6 స్పీడ్​ గేర్​బాక్స్​, స్లిప్పర్​ క్లచ్​, స్ప్లిట్​ సీటస్​, సెమీ డిజిటల్​ క్లస్టర్​, ట్రిప్పర్​ నేవిగేషన్​ వంటివి లభించనున్నాయట.

ఇదీ చూడండి:- Bullet 350 vs Honda H'ness CB350 : ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​?

ఇక ఇందులో 647.95సీసీ, పారలెల్​ ట్విన్​ సిలిండర్​, ఎయిర్​ అండ్​ ఆయిల్​ కూల్డ్​, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​ ఇంజిన్​ ఉండనుంది. రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​ 650, కాంటినెంటల్​ జీటీ 650, సూపర్​ మీటియర్​ 650లోనూ ఇదే ఇంజిన ఉంది. ఈ ఇంజిన్​.. 47 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

లాంచ్​ ఎప్పుడు?

ఇటలీలో జరగనున్న 2023 ఈఐసీఎంఏ షోలో ఈ ఇక ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650ని సంస్థ ప్రదర్శించేందుకు ప్లాన్​ చేస్తోంది. ఆ తర్వాత ప్రొడక్షన్​ మొదలవ్వొచ్చు. ఇండియాలో లాంచ్​, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. సంస్థ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

2023 బుల్లెట్​ 350 ఇదిగో..

2023 Royal Enfield Bullet 350 : ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ బైక్స్​లో ఒకటైన న్యూ-జెన్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 350ని సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ మోడల్​ బుకింగ్స్ కూడా​ ఓపెన్​ అయ్యాయి. 2023 బుల్లెట్​ 350 డిజైన్​ పరంగా పాత మోడల్​నే పోలి ఉన్నట్టు అనిపించినా, కొత్త బైక్​లో చాలా మార్పులే చేసింది సంస్థ! ముఖ్యంగా ఆ మోడల్​ను జే-ప్లాట్​ఫామ్​పై రూపొందించింది. క్లాసిక్​ 350, హంటర్​ 350, మిటియర్​ 350 వంటి రాయల్​ ఎన్​ఫీల్డ్​ మోటార్​సైకిల్స్​ని కూడా ఇదే ప్లాట్​ఫామ్​లో రూపొందిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం