తెలుగు న్యూస్ / ఫోటో /
Triumph Speed 400: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ కు పోటీగా వస్తున్న ట్రయంఫ్ స్పీడ్ 400
- ట్రయంఫ్ (Triumph) లేటెస్ట్ గా స్పీడ్ 400 (Speed 400), స్క్రాంబ్లర్ 400 ఎక్స్ (Scrambler 400 X) మోడల్స్ బైక్స్ ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. డైనమిక్ డిజైన్ లో రాయల్ లుక్స్ తో స్పీడ్ 400 బైక్ ను తీర్చిదిద్దింది. త్వరలో ఇవి భారత్ రోడ్లపై కూడా పరుగులు తీయనున్నాయి.

(1 / 9)
ట్రయంఫ్ (Triumph) స్పీడ్ 400 (Speed 400), స్క్రాంబ్లర్ 400 ఎక్స్ (Scrambler 400 X) మోడల్స్ బైక్స్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్నాయి. వాటి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
(2 / 9)
రోడ్డు మొత్తాన్ని వెలుగులతో నింపే స్థాయిలో ఇందులో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ను నియో రెట్రో ఫ్యుజన్ డిజైన్ తో ఏర్పాటు చేశారు.
(3 / 9)
ట్రయంఫ్ స్పీడ్ 400 లో ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లో అనలాగ్ స్పీడో మీటర్తో పాటు ఇతర వివరాలు తెలిపే డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది. బ్లూ టూత్ కనెక్టివిటీ లేకపోవడం ప్రతికూలాంశం.
(4 / 9)
స్పీడ్ 400 లో క్లాసిక్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ సీట్ ఉన్నాయి. ట్రయంఫ్ లైనప్ లో ఇది అత్యంత చిన్న సైజ్ మోటార్ సైకిల్.
(6 / 9)
ఈ స్పీడ్ 400లో విండ్ స్క్రీన్, రేడియేటర్ గార్డ్, హెడ్ లైట్ గ్రిల్, మడ్ స్ప్లాష్ కిట్; ఇంజన్ గార్డ్ వంటి అదనపు సదుపాయాలు ఉన్నాయి. మూడు రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.
(7 / 9)
ట్రయంఫ్ స్పీడ్ 400లో ఫ్యుయెల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్ 398.15 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,000 ఆర్పీఎం వద్ద 39.5 బీహెచ్పీ పవర్ ను, 6,500 ఆర్పీఎం వద్ద 37.5 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
(8 / 9)
ఈ బైక్ లో ఫ్రంట్ 300 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ కూడా ఉంది.
ఇతర గ్యాలరీలు