తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Electric Bike : మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. 180కి.మీ రేంజ్​తో!

New electric bike : మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. 180కి.మీ రేంజ్​తో!

Sharath Chitturi HT Telugu

11 September 2023, 11:45 IST

google News
    • New electric bike : 180కి.మీ రేంజ్​తో మార్కెట్​లో ఓ కొత్త ఎలక్ట్రిక్​ బైక్​ లాంచ్​ అయ్యింది. ఆ వివరాలు..
మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. 180కి.మీ రేంజ్​తో!
మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. 180కి.మీ రేంజ్​తో!

మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. 180కి.మీ రేంజ్​తో!

New electric bike launched in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​కు ఉన్న డిమాండ్​ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు.. ఓ కొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. దీని పేరు ఆబ్జో వీఎస్​01. ఈ మోడల్​ ఫీచర్స్​, బ్యాటరీ, రేంజ్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఎలక్ట్రిక్​ బైక్​ ఫీచర్స్​ ఇవే..

వాస్తవానికి ఇండియాలో ఎలక్ట్రిక్​ స్కూటర్లకు సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. ఈ-బైక్స్​కు డిమాండ్​ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అందుకే.. వీటిపైనా ఆటోమొబైల్​ సంస్థలు ఫోకస్​ పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే ఆబ్జో సంస్థ సైతం తన తొలి ఎలక్ట్రిక్​ బైక్​ను లాంచ్​ చేసింది. ఇందులో రెట్రో థీమ్​ క్రూజర్​ డిజైన్​ ఉంటుంది. ఇపీరియల్​ రెడ్​, మౌంటేన్​ వైట్​, జార్జియన్​ బే, బ్లాక్​ రంగుల్లో ఈ మోడల్​ అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్​సైకిల్​లో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, టెయిల్​ల్యాంప్స్​, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 17 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, ట్యూబ్​లెస్​ టైర్స్​ వంటివి వస్తున్నాయి.

ఈ ఆబ్జో వీఎస్​01 ఈ-బైక్​ గ్రౌండ్​ క్లియరెన్స్​ 158ఎంఎం. సీట్​ హైట్​ 700ఎంఎం. పొడవు 1,475ఎంఎం. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్​ మోటార్​.. 8.44 బీహెచ్​పీ పవర్​ను, 19ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఎలక్ట్రిక్​ మోటార్​కు 72వీ 70ఏహెచ్​ లిథియం అయాన్​ బ్యాటర్​ అటాచ్​ చేసి ఉంటుంది. ఈ బైక్​ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 180కి.మీల వరకు ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. ఫుల్​ ఛార్జింగ్​కు 6 గంటల 35 నిమిషాల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఫాస్ట్​ ఛార్జర్​ ఫెసిలిటీతో ఇది కేవలం 3 గంటల 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని వెల్లడించింది.

ఇదీ చూడండి:- TVS Apache RTR 310: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఈ ఆబ్జో వీఎస్​01లో ఈకో, నార్మల్​, స్పోర్ట్స్​ వంటి మోడ్స్​ ఉంటాయి. ఈ మోటార్​సైకిల్​ టాప్​ స్పీడ్​ 85కేఎంపీహెచ్​. ఇందులో రీజనరేటివ్​ బ్రేకింగ్​ టెక్నాలజీ వంటివి లభిస్తున్నాయి. సస్పెన్షన్స్​ విషయానికొస్తే.. ఈ మోటార్​సైకిల్​ ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్​, రేర్​లో డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వస్తున్నాయి. ఫ్రెంట్​- రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​ లభిస్తున్నాయి. కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ కూడా ఉంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్​ బైక ధర ఎంత..?

ABZO VS01 electric bike launch : ఆబ్జో వీఎస్​01 ఈ-బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.80లక్షలు- రూ. 2.22లక్షలుగా ఉంది.

తదుపరి వ్యాసం