TVS Apache RTR 310: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..
TVS Apache RTR 310: ఫ్లాగ్ షిప్ స్పోర్ట్స్ బైక్ అపాచీ ఆర్టీఆర్ 310 (Apache RTR 310) ను టీవీఎస్ మోటార్స్ లాంచ్ చేసింది. ఈ బైక్ లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. అపాచీ ఆర్ఆర్ 310 ప్లాట్ ఫామ్ పైననే దీన్ని కూడా డిజైన్ చేశారు.
TVS Apache RTR 310: ఫ్లాగ్ షిప్ స్ట్రీట్ ఫైటర్ అపాచీ ఆర్టీఆర్ 310 టీవీఎస్ మోటార్స్ లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం అపాచీ బ్రాండ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇండియాతో పాటు బ్యాంకాక్ లోనూ లాంచ్ చేసింది.
ధర ఎంత?
భారత్ లో అపాచీ ఆర్టీఆర్ 310 (TVS Apache RTR 310) బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 2.43 లక్షల నుంచి రూ. 2.64 లక్షల మధ్య ఉంటుంది. ఈ బైక్ ప్రి బుకింగ్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. టీవీఎస్ డీలర్ షిప్స్ లో రూ. 3,100 చెల్లించి ప్రి బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. డైనమిక్, అగ్రెసివ్ డిజైన్ తో ఈ బైక్ ను రూపొందించారు. ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డైనమిక్ రియర్ ఎల్ఈడీ బ్రేక్ లైటింగ్, స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్, వెడల్పైన హ్యాండిల్ బార్.. వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ ఈ బైక్ లో ఉన్నాయి. అలాగే, ఫ్యయెల్ ట్యాంక్ డిజైన్ ను కూడా డైనమిక్ గా తీర్చి దిద్దారు.
ఫీచర్స్..
ఈ అపాచీ ఆర్టీఆర్ 310 లో క్రూజ్ కంట్రోల్, ఐదు రైడ్ మోడ్స్, ఐదు ఇంచ్ ల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ సీట్, రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (RT-DSC), కార్నరింగ్ ఏబీఎస్ (cornering ABS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ కు టీవీఎస్ మోటార్స్ బిల్డ్ టు ఆర్డర్ (BTO) ప్లాట్ ఫామ్ పై కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఇచ్చింది. కస్టమర్లు తమకు నచ్చిన మార్పులతో కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇందుకు కస్టమర్లు అదనంగా చెల్లించాలి.
ఇంజన్..
ఈ బైక్ లో 312.12 సీసీ సింగిల సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 9700 ఆర్పీఎం వద్ద 35.1 బీహెచ్పీ పవర్ ను, 6650 ఆర్పీఎం వద్ద 28.7 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. కేవలం 2.8 సెకన్లలో జీరో నుంచి 60 కిమీల వేగాన్ని అందుకోగలదు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 150 కిమీలు.