తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi 12 Launch : రెడ్​మీ 12 లాంచ్​ త్వరలోనే- ధర ఎంతంటే..!

Redmi 12 launch : రెడ్​మీ 12 లాంచ్​ త్వరలోనే- ధర ఎంతంటే..!

Sharath Chitturi HT Telugu

03 June 2023, 8:32 IST

google News
    • Redmi 12 launch : రెడ్​మీ 12 లాంచ్​ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్​మీ 12 లాంచ్​ త్వరలోనే.. ధర ఎంతంటే..!
రెడ్​మీ 12 లాంచ్​ త్వరలోనే.. ధర ఎంతంటే..! (Representative image)

రెడ్​మీ 12 లాంచ్​ త్వరలోనే.. ధర ఎంతంటే..!

Redmi 12 launch : రెడ్​మీ 12 త్వరలోనే లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​.. రెడ్​మీ 10కి సక్సెసర్​గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు.. ఈ గ్యాడ్జెట్​కు సంబంధించిన ఫీచర్స్​, ధర వంటి వివరాలు లీక్​ అయ్యాయి. వాటిని ఓసారి చూద్దాము..

రెడ్​మీ 12 ఫీచర్స్​ ఇవే.!

టిప్​స్టర్​ కాపర్​ స్కైజిపెక్​ ప్రకారం.. పోర్చుగల్​లోని రెడ్​మీ అధికారిక వెబ్​సైట్​లో రెడ్​మీ 12 దర్శనమిచ్చింది. 4జీబీ ర్యామ్​- 8జీబీ ర్యామ్​/ 12జీబీ స్టోరేజ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రావచ్చు. ఇక స్మార్ట్​ఫోన్​ ధర 209.99 యూరోలుగా ఉంది. అంటే ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 18,600.

ఈ రెడ్​మీ 12.. మూడు రంగుల్లో అందుబాటులోకి రావొచ్చు. అవి.. బ్లూట్​, వైట్​, బ్లాక్​. ఇందులో 6.79 ఇంచ్ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉండనుంది. ఆక్టా కోర్​ మీడియా టెక్​ హీలియో జీ88 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఇందులో ఉండొచ్చు. రెడ్​మీ 10​లో అక్టా కోర్​ క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 680 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంది.

ఇదీ చూడండి:- Motorola Edge 40 vs Realme 11 Pro+ : ఈ రెండు ఫోన్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ?

50ఎంపీ కెమెరా సెటప్​..!

Redmi 12 price in India : ఇక ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్​, 2 ఎంపీ సెన్సార్​తో కూడిన కెమెరా సెటప్​ ఉండొచ్చు. ఎల్​ఈడీ ఫ్లాష్​ లైట్​ కూడా వస్తోంది. ఇక సెల్ఫీల కోసం ఫ్రెంట్​లో 8ఎంపీ కెమెరా లభించే అవకాశం ఉంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వంటివి లభించొచ్చు. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ ఇందులో ఉండొచ్చు. ఇక ఈ గ్యాడ్జెట్​ బరువు 198.5 గ్రాముల వరకు ఉండొచ్చు.

టిప్​స్టర్​ ఇచ్చిన సమాచారం ఎంత మేరకు నిజమనేది తెలియాల్సి ఉంది. లాంచ్​ టైమ్​ దగ్గరపడుతున్న కొద్ది.. ఈ రెడ్​మీ 12 స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలపై మరింత స్పష్టత వస్తుంది.

తదుపరి వ్యాసం