తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi A2 Series: భారతీయ మార్కెట్లోకి రెడ్ మీ ఏ2, ఏ2+; అందుబాటు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

Redmi A2 series: భారతీయ మార్కెట్లోకి రెడ్ మీ ఏ2, ఏ2+; అందుబాటు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

HT Telugu Desk HT Telugu

19 May 2023, 16:29 IST

google News
  • Redmi A2 series: చైనా కంపెనీ షావోమీ (Xiaomi) కి చెందిన రెడ్ మి (Redmi) రెడ్ మి ఏ2 (Redmi A2), రెడ్ మి ఏ2 ప్లస్ (Redmi A2+) అనే రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ను మే 19వ తేదీన ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Redmi)

ప్రతీకాత్మక చిత్రం

Redmi A2 series: చైనా కంపెనీ షావోమీ (Xiaomi) కి చెందిన రెడ్ మి (Redmi) రెడ్ మి ఏ2 (Redmi A2), రెడ్ మి ఏ2 ప్లస్ (Redmi A2+) అనే రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ను మే 19వ తేదీన ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్స ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తాయి. వీటిలో కృత్రిమ మేథ (AI) ఆధారిత కెమెరా సిస్టమ్ ఉంది.

Redmi A2 series: మీడియా టెక్ ప్రాసెసర్

ఈ రెడ్ మి ఏ2 (Redmi A2), రెడ్ మి ఏ2 ప్లస్ (Redmi A2+) స్మార్ట్ ఫోన్స్ లో మీడియా టెక్ హీలియో జీ 36 ఎస్ఓసీ (MediaTek Helio G36 SoC) చిప్ సెట్ ను అమర్చారు. అలాగే, ఇవి 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ (water-drop style notch) యూజర్ ఫ్రెండ్లీ డిస్ ప్లే అమర్చారు. వీటిలో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ రెడ్ మి ఏ2 సిరీస్ లో 6.52 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంటుంది.

Redmi A2 series: అందుబాటు ధరలో బడ్జెట్ ఫోన్

ఈ రెడ్ మి ఏ2 (Redmi A2), రెడ్ మి ఏ2 ప్లస్ (Redmi A2+) స్మార్ట్ ఫోన్స్ లో 8 ఎంపీ ఫ్రంట్, రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ రెండు ఫోన్లలో రెడ్ మి ఏ2 ప్లస్ (Redmi A2+) లో అదనంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. భారత్ లో ఈ ఫోన్స్ సేల్స్ మే 23 నుంచి ప్రారంభమవుతాయి. ధర విషయానికి వస్తే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ2 (Redmi A2) బేస్ వేరియంట్ ధర రూ. 5,999 గా ఉంది. అలాగే, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ2 (Redmi A2) వేరియంట్ రూ. 6,499 లకు లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ2 (Redmi A2) వేరియంట్ ధర రూ. 7,499 గా ఉంది. అలాగే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ 2 ప్లస్ (Redmi A2+) ధర రూ. 8,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్స్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ లో లభిస్తాయి. ఈ ఫోన్లను ఆమెజాన్, Mi.com, షావోమీ రిటైల్ స్టోర్స్ లో మే 23 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ కార్డ్స్ తో కొనుగోలు చేసేవారికి రూ. 500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

తదుపరి వ్యాసం