Oneplus Nord CE 3 Lite vs Redmi Note 12 : ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో.. వాల్యూ ఫర్ మనీ ఏది?
08 April 2023, 8:35 IST
- Oneplus Nord CE 3 Lite vs Redmi Note 12 : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, రెడ్మీ నోట్ 12లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో బెస్ట్ ఏది?
Oneplus Nord CE 3 Lite vs Redmi Note 12 : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ మొబైల్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది.. ఇటీవలే లాంచ్ అయిన రెడ్మీ నోట్ 12కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ ఓసారి పోల్చి.. వాల్యూ ఫర్ మనీ మోడల్ ఏది? అన్నది తెలుసుకుందాము..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ వర్సెస్ రెడ్మీ నోట్ 12- స్పెసిఫికేషన్స్..
Oneplus Nord CE 3 Lite features : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, రెడ్మీ నోట్ 12లో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కట్ ఔట్, సైడ్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటివి ఉన్నాయి. వన్‌ప్లస్ మోడల్లో 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ ఉండగా.. రెడ్మీలో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ రెండు గ్యాడ్జెట్స్లోనూ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
వన్‌ప్లస్ డివైజ్‌లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ దీని సొంతం. ఇందులో ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 13.1 ఉంది.
Redmi Note 12 features : మరోవైపు.. రెడ్మీ నోట్ 12లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దీని సొంతం. ఈ డివైజ్‌లో ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ వర్సెస్ రెడ్మీ నోట్ 12- ఫీచర్స్..
Oneplus Nord CE 3 Lite specifications : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్లో 108ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 ఎంపీ కెమెరా లభిస్తోంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంది.
రెడ్మీ నోట్ 12లో 48ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. 13ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తొంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. ఇది 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ కూడా.. 1080పీ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ వర్సెస్ రెడ్మీ నోట్ 12- ధర..
Oneplus Nord CE 3 Lite price : వనప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ. 19,999. 8జీబీ/ 256జీబీ వేరియంట్ ధర రూ. 21,999. ఏప్రిల్ 11 నుంచి ఇది సేల్కు వెళుతుంది.
Redmi Note 12 price : ఇక రెడ్మీ నోట్ 12 4జీబీ/ 128జీబీ మోడల్ ధర రూ. 17,999. 8జీబీ/ 128జీబీ వేరియంట్ ధర రూ. 19,999. 8జీబీ/ 256జీబీ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది.