Motorola Edge 40 vs Realme 11 Pro+ : ఈ రెండు ఫోన్స్‌లో ఏది వాల్యూ ఫర్ మనీ?
Motorola Edge 40 vs Realme 11 Pro+ : మోటోరోలా ఎడ్జ్ 40, రియల్మీ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
Motorola Edge 40 vs Realme 11 Pro+ : ఇండియాలో మోటోరోలా ఎడ్జ్ 40 సేల్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రియల్మీ 11 ప్రో+ కు ఇది గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది తెలుసుకుందాము..
మోటోరోలా ఎడ్జ్ 40 వర్సెస్ రియల్మీ 11 ప్రో+ స్పెసిఫికేషన్స్..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో సెంట్రల్లీ అలైన్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. రెండింట్లోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ లభిస్తోంది.
ఇక రియల్మీ 11 ప్రో+ లో రేర్ డిజైన్ అట్రాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. ఎడ్జ్ 40లో ఉన్న అల్యుమీనియం ఫ్రేమ్, ఐపీ68 రేటెడ్ ప్రొటెక్షన్ వంటివి ఉండటం లేదు.
ఫీచర్స్‌లో ఏది బెస్ట్..?
Motorola Edge 40 price in India : మోటారోలా ఎడ్జ్ 40లో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్డీ డిస్ప్లే లభిస్తోంది. 50ఎంపీ ప్రైమరీ, 13ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ రేర్‌లో ఉంటుంది. ఇక సెల్ఫీ కోసం ఫ్రెంట్లో 32ఎంపీ కెమెరా వస్తోంది. ఇందులో డైమెన్సిటీ 8020 చిప్సెట్ ఉంటుంది. ఎల్పీడడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌తో ఇది పనిచేస్తుంది. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. 68 వాట్ వయర్డ్, 15వాట్ వయర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీ ఇందులో ఉంది.
ఇదీ చూడండి:- Upcoming smartphones in June : జూన్‌లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
ఇక రియల్మీ 11 ప్రో+ విషయానికొస్తే.. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంది. రేర్‌లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌లు వస్తున్నాయి. ఇక సెల్ఫీ కోసం 32ఎంపీ కెమెరా లభిస్తోంది. ఇందులో డైమెన్సిటీ 7050 చిప్సెట్ వస్తోంది. ఆడ్రాయిడ్ 13 ఆధారిత యూఐ 4.0 సాఫ్ట్వేర్ ఇందులో ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ దీనిసొంతం. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ సైతం వస్తోంది.
ధరలు ఎంత..?
మోటోరోలా ఎడ్జ్ 40 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు.
Realme 11 Pro+ price in India : ఇక రియల్మీ 11 ప్రో+ ఇండియాలో ఈ నెల 8న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్, 12జబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండొచ్చు. వీటి ధరలు రూ. 28,000- 29,000గా ఉండే అవకాశం ఉంది.
సంబంధిత కథనం