తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Payday Loans : అత్యవసరంగా డబ్బులు కావాలా? ‘పేడే’ లోన్స్​ గురించి తెలుసుకోండి..

Payday Loans : అత్యవసరంగా డబ్బులు కావాలా? ‘పేడే’ లోన్స్​ గురించి తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu

17 December 2024, 10:21 IST

google News
  • Payday Loans : పర్సనల్​ లోన్​ వర్సెస్​ ‘పేడే’ లోన్​.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఏది ఎంచుకుంటే మనకి ప్రయోజనం? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

పర్సనల్​ లోన్​ వర్సెస్​ ‘పేడే’ లోన్
పర్సనల్​ లోన్​ వర్సెస్​ ‘పేడే’ లోన్

పర్సనల్​ లోన్​ వర్సెస్​ ‘పేడే’ లోన్

డబ్బుల అవసరం ఎప్పుడు, ఏ విధంగా, ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఇందుకే ఎమర్జెన్సీ ఫండ్​ని మెయిన్​టైన్​ చేసుకోవాలి. కొన్నిసార్లు, ఎమర్జెన్సీ ఫండ్స్​లోని నిధులు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పర్సనల్​ లోన్​ తీసుకుంటారు. కానీ మరో ఆప్షన్​ కూడా అందుబాటులో ఉందని చాలా తక్కువ మందికే తెలుసు! అదే పేడే (Payday) లోన్​. అసలేంటి ఈ పేడే లోన్​? పర్సనల్​ లోన్​కి దీనికి మధ్య వ్యత్యాసం ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పేడే లోన్​- పర్సనల్​ లోన్​..

ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​, పేడే లోన్​ రెండూ స్వల్పకాలిక ఆర్థిక ఉత్పత్తులు. ఇవి శీఘ్ర నిధులను అందించడానికి ఉద్దేశించినవి. ప్రయోజనాలు, రుణ పరిమాణం, తిరిగి చెల్లించడం, అర్హత ప్రమాణాలు వంటి వివిధ పారామీటర్లలో గణనీయంగా ఈ రెండు భిన్నంగా ఉంటాయి.

పర్సనల్ లోన్​- పే డే లోన్స్ మధ్య వ్యత్యాసాలు..

1. టార్గెట్​: వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు లేదా డిజిటల్ రుణదాతలు సాధారణంగా అందిస్తారు. అయితే పేడే లోన్స్​ అనేవి చాలా స్వల్పకాలిక రుణాలు! ఇవి తదుపరి జీతం క్రెడిట్ అయ్యే వరకు అత్యవసర ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగపడతాయి.

2. రుణ మొత్తం: పర్సనల్​ లోన్​ సాధారణంగా రూ .50,000 నుంచి రూ .25 లక్షల వరకు ఉంటుంది. అయితే పేడే లోన్​ సాధారణంగా రూ .1,000 నుంచి రూ .1 లక్ష వరకు ఉంటుంది.

3. కాలపరిమితి: పర్సనల్ లోన్​ని ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు, పే డే లోన్​ని 7 నుంచి 30 రోజుల కాలపరిమితికి ఇస్తారు. ఇది రుణగ్రహీత రూల్స్​కి అనుగుణంగా ఉంటుంది.

4. వడ్డీ రేటు: పర్సనల్ లోన్ సాధారణంగా సంవత్సరానికి 10-24 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది, కానీ పేడే లోన్ చాలా ఎక్కువ వడ్డీ రేటుతో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా 36 శాతం నుంచి 60 శాతం వరకు అధిక వడ్డీని ఇందులో వసూలు చేస్తారు. అంటే! అత్యవసరం, ఇక వేరే ఆప్షన్​ లేదని అర్థమైతే తప్ప పేడే లోన్​వైపు చూడకపోవడం ఉత్తమం!

5. ప్రాసెసింగ్ ఫీజు: పర్సనల్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా రుణ మొత్తంలో 1–3 శాతం మధ్య ఉంటుంది. అయితే పేడే లోన్ ఫిక్స్​డ్​ ఫీజు లేదా అధిక శాతం రుణ మొత్తాన్ని వసూలు చేస్తుంది (ఉదాహరణకు.. చిన్న రుణాలకు రూ .500 నుంచి రూ .1,000).

6. రీపేమెంట్: పర్సనల్ లోన్ రీపేమెంట్​ని ఎంచుకున్న కాలపరిమితిలో నెలవారీ ఈఎంఐల రూపంలో ఇస్తారు. అయితే పేడే లోన్ రీపేమెంట్ సాధారణంగా తదుపరి జీతం రోజున ఉండొచ్చు.

7. అర్హత: పర్సనల్ లోన్ అనేది వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. పేడే లోన్ ప్రధానంగా రెగ్యులర్ ఆదాయం ఉన్న వేతన జీవులకు ఇస్తారు.

8.ప్రమాణాలు: పర్సనల్ లోన్ పొందాలంటే ఆదాయ రుజువు, స్థిరమైన ఆర్థిక నేపథ్యం ఉండాలి. మరోవైపు పేడే లోన్​ కోసం జీతం లేదా రాబోయే వేతనం రుజువు అవసరం.

9. క్రెడిట్ స్కోర్: పర్సనల్ లోన్ ఎక్కువగా క్రెడిట్ స్కోర్ (700 కంటే ఎక్కువ) మీద ఆధారపడి ఉంటుంది. అయితే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు కూడా ఎక్కువ వడ్డీతో పేడే లోన్ రావొచ్చు.

10. రుణదాతలు: వ్యక్తిగత రుణాన్ని బ్యాంకులు, ఎన్​బీఎఫ్​లు వంటి రుణదాతలు ఇవ్వవచ్చు. అయితే పేడే లోన్ తరచుగా ఫిన్​టెక్ కంపెనీలు ఇస్తాయి. రెగ్యులేటర్, అంటే ఆర్బీఐ ద్వారా కఠినమైన నియంత్రణ ఉంటుంది.

(గమనిక:- లోన్​లతో రిస్క్​ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.)

తదుపరి వ్యాసం