Personal Loan : పర్సనల్ లోన్ కోసం సంతకం చేసే ముందు ప్లీజ్ ఒక్కసారి ఈ విషయాలు చూడండి
15 December 2024, 18:30 IST
- Personal Loan Tips : పర్సనల్ లోన్ అనేది కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితి కావొచ్చు. ఈ లోన్ తీసుకునే సమయంలో మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి. లోన్ అప్రూవ్ అయ్యాక తల బాదుకుంటే లాభం లేదు.
పర్సనల్ లోన్ టిప్స్
వ్యక్తిగత రుణాలు కొన్నిసార్లు అత్యవసరం కావొచ్చు. కష్టకాలంలో మనకు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ పర్సనల్ లోన్ ఒప్పందంపై సంతకం చేసే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. పర్సనల్ లోన్ మనకు వైద్య ఖర్చులు, ఊహించని ఆర్థిక అవసరాల కోసం తీసుకోవచ్చు. అయితే దీనిని తీసుకునేముందు మాత్రం కొన్ని విషయాలను తప్పకుండా చూడాలి.
లోన్ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధి మీ బడ్జెట్‌లో ఉందో లేదో చూసుకోవాలి. ఎంత డబ్బు అవసరమో అంచనా వేయాలి. మీ ఆర్థిక పరిస్థితికి లోన్ మొత్తం సరిపోతుందని అర్థం చేసుకోవాలి. అవసరానికి మించి రుణం తీసుకోవడం వల్ల అధిక చెల్లింపులు, అనవసరమైన అప్పులు ఎక్కువ అవుతాయి.
పర్సనల్ లోన్ ఒప్పందంపై సంతకం చేసే ముందు వేర్వేరు బ్యాంకుల లోన్స్ గురించి ఒకసారి చెక్ చేయాలి. దీనితో వివిధ రుణదాతలు అందించే వడ్డీ రేట్లను పోల్చుకోవాలి. రేట్లలో స్వల్ప వ్యత్యాసం కూడా తర్వాత మీ లోన్ మొత్తాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. ముందుగా వడ్డీ రేటు నిర్ణయించారా? దానిలో ఏవైనా మార్పులు ఉన్నాయా? అని చూడాలి.
లోన్ పొందడానికి ముందు మీ దగ్గర ఉన్న ఐడెంటీ ప్రూఫ్‌లు లేటెస్ట్‌వి ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. చిరునామా, ఆదాయం, ఫోటోలతో సహా మీ అన్ని పత్రాలు కచ్చితమైనవని నిర్ధారించుకోవాలి. లోన్ అగ్రిమెంట్ మీద సంతకం చేసే ముందు మీ అన్ని పత్రాలు సరైన సమాచారాన్ని కలిగి ఉన్నాయని చెక్ చేయండి.
లోన్ పొందే ముందు మీరు నిబంధనలు, షరతులను గమనించాలి. రుణ ఒప్పందం అన్ని వివరాలను అర్థం చేసుకుంటే ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. తిరిగి చెల్లించే వ్యవధిని అర్థం చేసుకోండి. ఎక్కువ కాలం నెలవారీ చెల్లింపులను తగ్గించవచ్చు. నిబంధనలు మీ బడ్జెట్, రీపేమెంట్ కెపాసిటీకి సరిపోతాయని చూడాలి.
ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ పెనాల్టీలు లేదా ఆలస్య చెల్లింపు రుసుములు వంటి ఏవైనా అదనపు ఛార్జీల గురించి వివరంగా అడగండి. ఇవి మొత్తం లోన్ ఖర్చుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
రుణ అర్హత, వడ్డీ రేట్లను నిర్ణయించడానికి మీ క్రెడిట్ స్కోర్‌ను ఉపయోగిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ మీకు మెరుగైన రుణ నిబంధనలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే పేలవమైన స్కోర్ అధిక రేట్లు లేదా రుణ తిరస్కరణకు గురికావొచ్చు. మీరు నిర్ణీత సమయాల్లో వడ్డీ రేటును చెల్లించాలి. ఇది మీకు మెరుగైన క్రెడిట్ స్కోర్‌ని పొందడంలో ఉపయోగపడుతుంది.
రుణం నెలవారీ బడ్జెట్, మొత్తం మీ ఆర్థిక పరిస్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా లేదా ఇతర ముఖ్యమైన ఖర్చులను ప్రభావితం చేయకుండా నెలవారీ తిరిగి చెల్లింపులను సౌకర్యవంతంగా ఉండాలి. మెంటల్ టెన్షన్స్ ఉండకూడదు.