Personal loan tips : రూ. 15వేల జీతం ఉంటే పర్సనల్ లోన్ అప్రూవ్ అవుతుందా?
21 December 2024, 8:10 IST
Personal loan with low salary : జీతం తక్కువ ఉంటే పర్సనల్ లోన్ రాదేమో అని భయపడుతున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ జీతంతో కూడా పర్సనల్ లోన్ ఎలా పొందాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రూ. 15వేల జీతంతో పర్సనల్ లోన్ పొందొచ్చా?
డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో అంచనా వేయలేము. అందుకే అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్ కోసం చూస్తుంటాము. కానీ తక్కువ జీతం ఉంటే పర్సనల్ లోన్ అప్రూవ్ అవుతుందా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. నెలకు రూ. 15వేల వేతనంతో పర్సనల్ లోన్ పొందొచ్చా? ఇక్కడ తెలుసుకుందాము..
రూ.15,000 జీతంతో పర్సనల్ లోన్: మీరు అర్హులా?
ఈ ప్రశ్నకు సాధారణ సమాధానం యెస్! నెలకు రూ.15,000 వేతనంతో పర్సనల్ లోన్ పొందొచ్చు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అధిక క్రెడిట్ స్కోర్‌తో స్థిరమైన వేతనాన్ని చూస్తున్నప్పటికీ, చాలా బ్యాంకులు తక్కువ జీతం ఉన్న వ్యక్తులకు కూడా వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి.
కానీ ఇక్కడ ఒక విషం గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్సనల్ లోన్ అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. పైగా, రుణంగా మీకు అందించే అసలు మొత్తం మీరు ఆశించిన దానికంటే తక్కువగా ఉండవచ్చు. అందువల్ల, బలమైన ప్రొఫైల్‌ని నిర్మించడానికి మీరు ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోరును మెయిన్టైన్ చేయడం, స్థిరమైన ఉపాధిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. రూ.15,000 వేతనంతో పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్న టాప్ రుణదాతల గురించి తెలుసుకుందాం.
సోర్స్: పైసాబజార్
1. క్రెడిట్‌బీ
ఇంటరెస్ట్ రేట్లు: 16% నుంచి
మాక్సిమమ్ లోన్ అమౌంట్ : రూ. 5 లక్షల వరకు
లోన్ కాలపరిమితి : 3 సంవత్సరాల వరకు
2. పేసెన్స్
ఇంట్రెస్ట్ రేట్లు:1.4% నుండి
మాక్సిమమ్ లోన్: రూ.5 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: అప్లికేషన్ ప్రొఫైల్ ప్రకారం ఆధారపడి ఉంటుంది
3. మనీవ్యూ
ఇంటరెస్ట్ రేట్లు: 14% నుంచి
మాక్సిమమ్ లోన్ అమౌంట్: రూ. 10 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 5 సంవత్సరాల వరకు
4. ఎస్బీఐ
ఇంట్రెస్ట్ రేట్లు: 11.45% నుండి
మాక్సిమమ్ లోన్ అమౌంట్ : రూ. 30 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు
5. యాక్సిస్ బ్యాంక్
ఇంట్రెస్ట్ రేట్లు: 11.25% నుండి
మాక్సిమమ్ లోన్ మొత్తం: రూ. 10 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 5 సంవత్సరాల వరకు
టాటా క్యాపిటల్
ఇంట్రెస్ట్ రేట్లు: 11.99% నుండి
మాక్సిమమ్ లోన్ అమౌంట్: రూ.35 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు
7. క్యాష్ఈ
ఇంట్రెస్ట్ రేట్లు: 2.25% నుండి
మాక్సిమమ్ రుణ మొత్తం: రూ. 4 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 1.5 సంవత్సరాల వరకు
8. స్టాష్‌ఫిన్
ఇంట్రెస్ట్ రేట్లు: 11.99% నుండి
గరిష్ట రుణ మొత్తం: రూ.5 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 4 సంవత్సరాల వరకు
9. ఫైబ్ఈ (ఎర్లీసాలరీ)
ఇంట్రెస్ట్ రేట్లు: 16% నుండి
మాక్సిమమ్ లోన్ అమౌంట్: రూ. 5 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 3 సంవత్సరాల వరకు
పర్సనల్ లోన్ తీసుకునే ముందు..
- అప్రూవల్ అవకాశాలను పెంచడానికి, మీ రుణంపై తక్కువ వడ్డీ రేట్లను పొందడానికి ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోరును మెయిన్టైన్ చేయండి.
- వీలైతే మీ దరఖాస్తు బలాన్ని పెంచుకోవడానికి మంచి ఆదాయం ఉన్న సహ దరఖాస్తుదారుడితో దరఖాస్తు చేసుకోండి.
- ఈఎమ్ఐ భారాన్ని తగ్గించడానికి ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోండి. ఇది మీ రుణ ఆమోదం అవకాశాలను పెంచుతుంది!
- మెరుగైన ప్రొఫైల్‌ని మెయిన్టైన్ చేయడంలో మీకు సహాయపడే అద్దె ఆదాయం, పెట్టుబడులు వంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, పత్రాలను సేకరించి దరఖాస్తు చేసుకోండి.
మార్కెట్లోని ఇతర రుణాలతో పోలిస్తే ఈ లోన్లు అధిక వడ్డీ రేటును కలిగి ఉన్నందున మీకు నిజంగా వ్యక్తిగత రుణం అవసరమా? అని అంచనా వేయడం చాలా ముఖ్యం. మీ బడ్జెట్‌కి బాగా సరిపోయే ఇతర ఆప్షన్స్‌ని కూడా అన్వేషించాలి.