Paytm share price target : భారీగా పెరగనున్న పేటీఎం షేర్లు! టార్గెట్ రూ. 1300?
08 January 2024, 22:01 IST
- Paytm share price target : పేటీఎం షేర్లు గత ఐదు రోజుల్లో 17శాతం పెరిగాయి. ఇక్కడి నుంచి ఈ స్టాక్ రూ. 1300 వరకు వెళుతుందని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి.
భారీగా పెరగనున్న పేటీఎం షేర్లు! టార్గెట్ రూ. 1300?
Paytm share price target : నవంబర్ 24న కనిష్ఠ స్థాయికి పడిపోయిన పేటీఎం షేర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాయి. ఇక గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లో పేటీఎం స్టాక్ ఏకంగా 17శాతం పెరిగింది. ఒక్క శక్రవారం ట్రేడింగ్ సెషన్లోనే పేటీఎం స్టాక్ 7.72శాతం వృద్ధిచెందింది. ఈ సంస్థ షేర్లు భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు.. పేటీఎం షేర్ ప్రైజ్ టార్గెట్‌ను రూ. 1300 వరకు చెబుతున్నాయి.
పేటీఎం స్టాక్.. ఎందుకు పెరుగుతోంది?
కొన్ని రోజుల క్రితం.. పేటీఎం ఎనలిస్ట్ మీటింగ్ జరిగింది. 2023 సెప్టెంబర్ నాటికి.. అడ్జస్టెడ్ ఎబిట్డా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సాధిస్తామని సంస్థ చాలా నమ్మకంగా చెప్పింది. పేటీఎం వ్యాపారం మోడల్, తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యచరణను యాజమాన్యంలోని సీనియర్లు చర్చించారు. ఫలితంగా.. అనేక బ్రోకరేజీ సంస్థలు.. పేటీఎంకు 'బై రేటింగ్'ని ఇచ్చాయి.
Paytm share price : మోర్గాన్ స్టాన్లీ, సీఎల్ఎస్ఏ, జేఎం ఫైనాన్షియల్ వంటి సంస్థలు.. పేటీఎం షేర్ ప్రైజ్ టార్గెట్‌ను రూ. 600- రూ. 700 మధ్యలో ఇచ్చాయి.
"పేటీఎం బిజినెస్ మోడల్‌పై మేము ఆచితూచి వ్యవహరిస్తాము. ఈ వ్యాపారంలో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువే. ప్రాఫిటెబులిటీ సాధించేందుకు చాలా ఏళ్లు గడిచిపోతుంది. కానీ పేటీఎం ఫైనాన్షియల్స్ నిదానంగా మెరుగుపడుతున్నాయి. ప్రాఫిటెబులిటీని పెంచుకోవాలని యాజమాన్యం కూడా భావిస్తోంది. అందువల్ల ఎఫ్వై26 నాటికి పేటీఎం అజ్జస్టెడ్ బ్రేక్‌ఈవెన్‌ను సాధించవచ్చు. అదే సమయంలో.. ఐపీఓ దశ నుంచి పేటీఎం షేరు 77శాతం పతనమైంది. ఫలితంగా స్టాక్‌లో రిస్క్- రివార్డ్ సానుకూలంగా ఉంది. అందుకే పేటీఎంకు బై రేటింగ్ ఇస్తున్నాము. టార్గెట్ ప్రైజ్ రూ. 600," అని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది.
మరోవైపు ఏడాది కాలంలో పేటీఎం షేర్ ప్రైజ్ రూ. 1,100కి చేరుతుందని గోల్డ్‌మాన్ సాక్స్ అభిప్రాయపడింది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్.. పేటీఎంకు బై రేటింగ్ ఇస్తూ.. టార్గెట్ ప్రైజ్‌ను రూ. 1,285గా పేర్కొంది.
పేటీఎం క్యూ2 ఫలితాలు..
Paytm q2 results 2022 : డిజిటల్ ఫైనాన్స్ సర్వీస్‌లు అందించే పేటీఎం.. 2023 ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను గత నెలలో ప్రకటించింది. క్యూ2లో పేటీఎం కన్సాలిడేటెడ్ లాస్.. రూ. 571కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్ లాస్ రూ. 472.90కోట్లుగా ఉండేది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పేటీఎం స్టాక్ ప్రైజ్..
Paytm share price history : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో 7.72శాతం పెరిగిన పేటీఎం స్టాక్.. 540 వద్ద స్థిరపడింది. ఇక గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ ఏకంగా 17.98శాతం వృద్ధి చెందింది. కానీ.. నెల రోజుల్లో పేటీఎం షేరు ధర 17శాతం పతనమైంది. ఆరు నెలల్లో 12.16శాతం పడిపోయింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 59.71శాతం నష్టపోయింది పేటీఎం స్టాక్. ఏడాది కాలంలో ఏకంగా 66.36శాతం నష్టపోయి.. మదుపర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది!