ITR filing last date : ఐటీఆర్ ఫైలింగ్‌కు నేడే లాస్ట్ డేట్.. ఇప్పటివరకు 6.13కోట్ల రిటర్నులు దాఖలు!
31 July 2023, 15:24 IST
ITR filing last date : ఇప్పటివరకు 6.13కోట్లకుపైగా ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. నేటి రాత్రితో గడువు ముగియనుంది.
ఐటీఆర్ ఫైలింగ్‌కు నేడే లాస్ట్ డేట్..
ITR filing last date : ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు నేటితో ముగియనుంది. వేతన జీవులు తమ ఐటీఆర్‌ను నేటి రాత్రిలోపు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటివరకు 6.13కోట్లకుపైగా ఐటీఆర్‌లు ఫైల్ అయినట్టు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.
"ఆదివారం వరకు 6.13కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నాటికి మరో 11.03లక్షల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి," అని ఐటీశాఖ ట్వీట్ చేసింది.
తుది గడువును పొడిగిస్తారా..?
గతేడాది.. జులై 31 నాటికి మొత్తం మీద 5.83కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ అయ్యాయి. ఈసారి.. ఈ నెంబర్ రెండు, మూడు రోజుల క్రితమే దాటిపోయింది.
ITR filing 2023 : "ఈ మైలురాయిని అధిగమించడంలో సాయం చేసిన పన్నుచెల్లింపుదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సహాయ సహకారమే కీలకం," అని ఐటీశాఖ ట్వీట్లో పేర్కొంది.
ఇదీ చూడండి:- ITR refund status check : ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
చివరి నిమిషం వరకు వెయిట్ చేయవద్దని, తొందరగా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలని ఐటీశాఖ చెబుతూ వస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా, లేదా సాయం కావాలన్నా.. orm@cpc.incometax.gov.in లో కనెక్ట్ అవ్వాలని వెల్లడించింది.
ITR filing deadline extension : మరోవైపు.. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు తుది గడువును పొడిగించే యోచనలో ప్రభుత్వం లేదని ఐటీశాఖ స్పష్టం చేసింది. అయితే.. చాలా మంది తుది గడువులోపు తాము ఫైల్ చేయలేమని అభిప్రాయపడుతున్నట్టు పలు సర్వేలు చెప్పాయి.
తుది గడువు పూర్తైన తర్వాత కూడా ఫైల్ చేసే ఆప్షన్ ఉన్నప్పటికీ.. జరిమానా పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేస్తే.. రూ. 5వేల జరిమానాతో వాటిని స్వీకరిస్తారు. అదే డిసెంబర్ 31 తర్వాత ఫైల్ చేస్తుంటే.. రూ. 10వేల వరకు ఫైన్ పడుతుంది.