తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr For Youtube Income: ‘యూట్యూబ్’ ఆదాయానికి కూడా ఐటీఆర్ దాఖలు చేయాలా?

ITR for YouTube Income: ‘యూట్యూబ్’ ఆదాయానికి కూడా ఐటీఆర్ దాఖలు చేయాలా?

HT Telugu Desk HT Telugu

25 July 2023, 15:50 IST

google News
  • ITR for YouTube Income: చాలా మందికి యూట్యూబ్ చానెల్ ఒక మంచి ఆదాయ మార్గం. సొంతంగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. లక్షల్లో సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే, వారు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలా? వద్దా?.. చేయాలంటే, ఎలా చేయాలి? అనే ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

ITR for YouTube Income: చాలా మందికి యూట్యూబ్ (YouTube) చానెల్ ఒక మంచి ఆదాయ మార్గం. సొంతంగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. లక్షల్లో సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే, వారు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలా? వద్దా?.. చేయాలంటే, ఎలా చేయాలి? అనే ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి.

YouTube channel Income: యూ ట్యూబ్ చానెల్ పై ఆదాయం

ఆదాయ పన్ను అధికారులు, నిపుణుల వివరణ ప్రకారం.. సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా గణనీయమైన ఆదాయం పొందుతున్న వారు కచ్చితంగా ఐటీఆర్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, యూట్యూబ్ లో మీరు అప్ లోడ్ చేసే కంటెంట్, యూట్యూబ్ యాక్టివిటీ ద్వారా మీరు సంపాదించే ఆదాయం ఆధారంగా ఐటీఆర్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ద్వారా లభించే ఆదాయమే మీ ప్రధాన ఆదాయ మార్గమైతే, యూట్యూబ్ ద్వారా మీరు గణనీయమైన ఆదాయం పొందుతున్నట్లైతే.. ఆ ఆదాయం వ్యాపార ఆదాయం (business income) కిందకు వస్తుంది. ఆ ఆదాయంపై ‘వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం లేదా సంపాదన (Profits and Gains of Business or Profession)’ కేటగిరీలో ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా, మీ ప్రధాన ఆదాయ వనరు వేరే ఉండి, యూట్యూబ్ చానెల్ ను మీరు ఒక హాబీగా కొనసాగిస్తూ, ఆ చానెల్ ద్వారా పెద్దగా ఆదాయం పొందనట్లైతే.. ఆ ఆదాయాన్ని ‘ఇతర మార్గాల ద్వారా ఆదాయం (income from other sources) కేటగిరీలో చూపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం

యూట్యూబ్ ద్వారా మీకు లభిస్తున్న ఆదాయం ఒకవేళ ‘వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం లేదా సంపాదన (Profits and Gains of Business or Profession)’ కేటగిరీలోకి వస్తే.. దాన్ని వృత్తి ద్వారా లభిస్తున్న ఆదాయమా (income from profession)? లేక వ్యాపారం ద్వారా లభిస్తున్న ఆదాయమా (income from business)? అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోవాలి. మీరు అప్ లోడ్ చేసే వీడియోల్లోని విషయంపై అది ఆధారపడి ఉంటుంది. మీరు అప్ లోడ్ చేసే వీడియోల్లోని కంటెంట్ ను రూపొందించడానికి ప్రత్యేక శిక్షణ అవసరమైనా, లేదా నిపుణులే ఆ కంటెంట్ ను రూపొందించగలరని తేలినా.. ఆ ఆదాయం ‘వృత్తి ద్వారా లభించే ఆదాయం (income from profession)’ కిందకు వస్తుంది. అలాంటి నైపుణ్యం, శిక్షణ అవసరం లేని కంటెంట్ ను అప్ లోడ్ చేసి ఆదాయం పొందతున్నట్లైతే.. అది వ్యాపారం ద్వారా లభిస్తున్న ఆదాయం(income from business) అవుతుంది. ఈ ఆదాయానికి సెక్షన్ 44 ఏడీ కింద పన్ను చెల్లించాలి.

తదుపరి వ్యాసం