YouTube threatens viewers: ‘అలా చేస్తే.. ఇకపై యూట్యూబ్ లో వీడియోలు చూడలేరు’: వీక్షకులకు యూట్యూబ్ వార్నింగ్!
YouTube threatens viewers: ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ గా ‘యూట్యూబ్’ ఎంతో పాపులర్. చాలా మందికి ఇది ఆదాయ వనరుగా కూడా ఉంది. వీక్షకులకు సంబంధించి యూట్యూబ్ త్వరలో ఒక నిబంధన తీసుకురాబోతోంది. అది అమల్లోకి వచ్చిన తరువాత.. ఆ నిబంధనను పాటిస్తేనే, యూట్యూబ్ చూడడం వీలవుతుంది.
YouTube threatens viewers: యూట్యూబ్ (YouTube) లో వీడియోలను చూడాలనుకుంటే ఇకపై మీరు మీ డివైజ్ లో యాడ్ బ్లాకర్ (ad blocker) ను డిసేబుల్ చేయాల్సి ఉంటుంది. యాడ్ బ్లాకర్ ఇనేబుల్ అయి ఉంటే, మీరు యూట్యూబ్ లో వీడియోలను చూడలేరు. ఈ దిశగా ఒక నిబంధనను యూట్యూబ్ త్వరలో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది.
Disable ad blockers: వీడియోలను చూడలేరు..
వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ (ads) ను అడ్డుకోవడం కోసం సాధారణంగా డివైజెస్ లోని సెట్టింగ్స్ లో ఉండే యాడ్ బ్లాకర్ (ad blocker) ను యూజర్లు ఆన్ చేస్తుంటారు. దాంతో యాడ్ వ్యూస్ తగ్గడం, తద్వారా యాడ్ రెవెన్యూ తగ్గడం జరుగుతుంది. దాంతో, ఈ విషయంపై యూట్యూబ్ దృష్టి పెట్టింది. యాడ్ బ్లాకర్స్ ను అడ్డుకునే దిశగా ఒక నిబంధనను తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం, ఆ నిబంధన ప్రస్తుతం ఇంటర్నల్ టెస్టింగ్ దశలో ఉందని యూట్యూబ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆ నిబంధన ప్రకారం.. మొబైల్ లేదా పీసీ లేదా ల్యాప్ ట్యాప్ ల్లో యాడ్ బ్లాకర్ ఆన్ అయి ఉంటే.. యూట్యూబ్ ఓపెన్ చేయగానే.. యాడ్ బ్లాకర్ ను డిసేబుల్ చేయాలని, యాడ్స్ ను అనుమతించాలని కోరుతూ ఒక మెసేజ్ వస్తుంది. యూజర్ ఆ మెసేజ్ ను పట్టించుకోనట్లయితే, యూట్యూబ్ లో వీడియో స్ట్రీమింగ్ ఆగిపోతుంది. ఈ నిబంధన యూజర్లను కచ్చితంగా ఇబ్బంది పెడ్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Premium subscription plan: ప్రీమియం కు సబ్ స్క్రైబ్ చేసుకోండి..
యూజర్లకు యూట్యూబ్ మరో ఆప్షన్ కూడా ఇవ్వనుంది. ఒకవేళ యాడ్స్ చూసే ఇబ్బంది లేకుండా, వీడియోలను చూడాలనుకుంటే, రూ. 129 చెల్లించి యూట్యూబ్ ప్రీమియం కు సబ్ స్క్రైబ్ చేసుకోవాలని సూచిస్తోంది. యూట్యూబ్ మాత్రమే కాదు, ఇంటర్నెట్ లో యాడ్ రెవెన్యూపై ఆధారపడే చాలా సైట్స్ ఈ యాడ్ బ్లాకర్ ను వాడడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వాటిలోని కంటెంట్ ను చూడాలనుకుంటే, ముందుగా యాడ్ బ్లాకర్ ను డిసేబుల్ చేయాలని కోరుతూ యూజర్లకు నోటిఫికేషన్స్ పంపిస్తుంటాయి. యూట్యూబ్ గతంలో కూడా ఇలాంటి కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది.