ITR filing deadline : ఐటీఆర్ ఫైలింగ్​​ డెడ్​లైన్​ను కేంద్రం పొడిగిస్తుందా?-itr filing due date why income taxpayers are expecting deadline extension ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Filing Deadline : ఐటీఆర్ ఫైలింగ్​​ డెడ్​లైన్​ను కేంద్రం పొడిగిస్తుందా?

ITR filing deadline : ఐటీఆర్ ఫైలింగ్​​ డెడ్​లైన్​ను కేంద్రం పొడిగిస్తుందా?

Sharath Chitturi HT Telugu
Jul 29, 2023 08:45 AM IST

ITR filing deadline extension : ఐటీ రిటర్నులు ఫైల్​ చేసేందుకు జులై 31 వరకు సమయం ఉంది. ఈ డెడ్​లైన్​ను కేంద్రం పొడిగిస్తుందా?

ఐటీఆర్​ డెడ్​లైన్​ను కేంద్రం పొడగిస్తుందా?
ఐటీఆర్​ డెడ్​లైన్​ను కేంద్రం పొడగిస్తుందా? (Mint)

ITR filing deadline extension : 2023 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్​ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ డెడ్​లైన్​లోపు అందరు ఐటీఆర్​ని ఫైల్​ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డెడ్​లైన్​ను పొడగించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి కేంద్రం ఏమంటోంది?

5 కోట్ల ఐటీఆర్​ ఫైలింగ్స్​..

2022- 23 ఆర్థిక ఏడాదికి సంబంధించి.. 27 జులై నాటికి 5.03కోట్ల ఐటీఆర్​లు ఫైల్​ అయ్యాయి. 4.46కోట్ల ఐటీఆర్​లకు ఈ-వెరిఫికేషన్​ జరిగింది. అంటే.. 88శాతం ఐటీఆర్​ ఫైలింగ్స్​ వెరిఫికేషన్​ పూర్తయింది. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.

వేతన జీవులు ఈ నెల 31లోపు తమ ఐటీ రిటర్నులను ఫైల్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బిలేటెడ్​ రిటర్నుల పేరుతో లేట్​ ఫీజు చెల్లించి డిసెంబర్​ 31 వరకు ఫైల్​ చేసుకునే ఆప్షన్​ ఉంది.

ఇదీ చూడండి:- Income tax deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..

డెడ్​లైన్​ పొడిగిస్తారా?

ఐటీ రిటర్నుల ఫైలింగ్​కు సంబంధించి.. లోకల్​సర్కిల్స్​ అనే సంస్థ తాజాగా ఓ సర్వే చేపట్టింది. డెడ్​లైన్​లోపు ఫైలింగ్​ చేయలేమని 14శాతం మంది ట్యాక్స్​పేయర్లు అభిప్రాయపడ్డారు. 12వేల మందిలో 27శాతం మంది.. ఇంకా ఐటీ రిటర్నులు ఫైల్​ చేయాల్సి ఉందని వెల్లడించారు. అయితే.. సర్వేలో పాల్గొన్న ప్రతి 10మందిలో ఏడుగురు ఇప్పటికే ఐటీఆర్​ ఫైల్​ చేసుకున్నారు. మరో 5శాతం మంది.. ఫైలింగ్​కు ప్రయత్నించినా, వివిధ సమస్యలు ఎదుర్కొన్నారు. 8శాతం మంది ఇంకా ఫైల్​ చేయలేదని, నెల చివరి వరకు చేసేస్తామని స్పష్టం చేశారు.

ITR filing deadline 2023 : అనేక రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా పన్నుచెల్లింపు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుక కేంద్రం ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును పొడిగిస్తే ఉత్తమం అని ఛార్టెడ్​ అకౌంటెంట్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే.. ఈ ఏడాది.. ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్​ డెడ్​లైన్​ను పొడిగించే అవకాశం లేదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది. మరి పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం