Oppo Reno 12 launch : కూల్ ఫీచర్స్‌తో ఒప్పో రెనో 12 సిరీస్ లాంచ్- ధర ఎంతంటే..
13 July 2024, 5:51 IST
Oppo Reno 12 series launched : ఒప్పో రెనో 12, రెనో 12 ప్రో ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. కొత్త రెనో 12 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వాటి ఫీచర్స్, ధర వివరాలు మీకోసం..
ఇండియాలో ఒప్పో రెనో 12 సిరీస్ లాంచ్..
ఒప్పో గత నెల రోజులుగా రెనో 12 సిరీస్‌ను టీజ్ చేస్తూ, అధికారికంగా లాంచ్ అయ్యే వరకు రెనో సిరీస్ అభిమానులను ఎగ్జైట్ చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు ఒప్పో రెనో 12 సిరీస్‌ని ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లు, కొత్త స్పెసిఫికేషన్లు, మరీ ముఖ్యంగా ఏఐతో ఈ స్మార్ట్‌ఫోన్స్‌ని ఆవిష్కరించింది. కొత్త రెనో సిరీస్‌లో ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో ఉన్నాయి. యూజర్ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్, ధర వివరాలు..
ఒప్పో రెనో 12 ప్రో స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 12 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ ఇన్ఫినిటీ వ్యూ డిస్ప్లేను కలిగి ఉంది. ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్, 1200నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ ప్రాసెసర్, టీఎంఎస్సీ 4ఎన్ఎం ప్రాసెస్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. 12 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ని ఇందులో అందించారు.
ఫోటోగ్రఫీ కోసం ఒప్పో రెనో 12 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో సోనీ లైట్ 600తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, శాంసంగ్ ఎస్ 5 కెజెఎన్ 5 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. రెనో 12 ప్రోలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, శాంసంగ్ ఎస్5కేజేఎన్5 సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. 80వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. చివరిగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్ 14.1 పై పనిచేస్తుంది, 3 సంవత్సరాల ఓఎస్ అప్గ్రేడ్లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ఫిక్స్‌లను అందిస్తుంది.
ఒప్పో రెనో 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఒప్పో రెనో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ ఇన్ఫినిటీ వ్యూ డిస్ ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఒప్పో రెనో 12లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ఆధారిత ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. దీంతోపాటు 32 మెగా పిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాను అందించారు. 80వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.
ఒప్పో రెనో 12 సిరీస్‌లో ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ టూల్ బాక్స్, ఏఐ స్పీక్, ఏఐ లింక్ బూస్ట్ వంటి క్లౌడ్ ఆధారిత ఏఐ ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి.
ఒప్పో రెనో 12 సిరీస్ ధర..
ఒప్పో రెనో 12 స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మ్యాట్ బ్రౌన్, ఆస్ట్రో సిల్వర్, సన్‌సెట్ పీచ్. రెనో 12 ప్రో సన్ సెట్ గోల్డ్, స్పేస్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో రెనో 12 ప్రారంభ ధర రూ.32,999 కాగా, ఒప్పో రెనో 12 ప్రో ప్రారంభ ధర రూ.36,999.
ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం. టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.