Oppo F27 Pro Plus: ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం; ధర, ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే..
Oppo F27 Pro Plus 5G: ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ సేల్స్ జూన్ 20, గురువారం ప్రారంభమయ్యాయి. రూ. 30 వేల లోపు ధరలో లభించే ఈ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ పై లభించే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, తదితర వివరాలు తెలుసుకోండి.
Oppo F27 Pro Plus 5G: ఒప్పో తన మోస్ట్ డ్యూరబుల్ స్మార్ట్ ఫోన్ ఎఫ్27 ప్రో ప్లస్ 5జీని గత వారం లాంచ్ చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఐపీ 69-రేటెడ్ స్మార్ట్ ఫోన్. ఇది వాటర్ ప్రూఫ్ మోడల్ స్మార్ట్ ఫోన్. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ మన్నికను అందించడమే కాకుండా స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులను ఆకర్షించే కొన్ని ఆహ్లాదకరమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో వస్తుంది. ఒప్పో (OPPO) ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ సేల్స్ జూన్ 20, గురువారం నుండి అద్భుతమైన ఆఫర్లతో ప్రారంభమవుతున్నాయి.
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ ధర
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ (Oppo F27 Pro Plus 5G) రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అవి 128 జీబీ, 256 జీబీ. వీటి ధరలు వరుసగా రూ.27999, రూ.29999. ఇవి డస్క్ పింక్, మిడ్ నైట్ నేవీ అనే రెండు కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది, రెండూ కూడా వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, కాస్మిక్ రింగ్ ప్యాట్రన్ తో వస్తాయి. దీనివల్ల ఈ స్మార్ట్ ఫోన్ మరింత ప్రీమియంగా, దృఢంగా కనిపిస్తుంది.
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ డిస్కౌంట్ ఆఫర్స్
కొనుగోలుదారులు ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5 జీ స్మార్ట్ ఫోన్ ను అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్ల ద్వారా పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. తమ వద్ద ఉన్న ఒప్పో స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసే వినియోగదారులకు రూ.1000 లాయల్టీ బోనస్ తో పాటు రూ.1000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అదనంగా, కంపెనీ 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఒప్పో ఇండియా వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల నుండి ఆన్ లైన్లో కొనుగోలు చేయవచ్చు. లేదా, మీ సమీప రిటైల్ స్టోర్లలో ఆఫ్ లైన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5 జీ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్, పీక్ బ్రైట్ నెస్ 950 నిట్స్. ఈ స్మార్ట్ ఫోన్ లో స్ప్లాష్ టచ్ ఫంక్షనాలిటీ కూడా ఉంది. దీనివల్ల ఈ స్మార్ట్ ఫోన్ ను వర్షంలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.
కెమెరా సెటప్
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ లో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.