Best camera phones : రూ. 30వేల బడ్జెట్​లో ది బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే..-oneplus nord ce 4 vivo v30e realme 12 pro plus more check out best camera phones under 30000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Camera Phones : రూ. 30వేల బడ్జెట్​లో ది బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Best camera phones : రూ. 30వేల బడ్జెట్​లో ది బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Jun 15, 2024 01:41 PM IST

Best camera phones in India : రూ.30,000 లోపు మంచి కెమెరా స్మార్ట్​ఫోన్​ వెతుకుతున్నారా? అయితే.. ఇది మీకోసమే! పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రూ. 30వేల బడ్జెట్​లో ది బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే..
రూ. 30వేల బడ్జెట్​లో ది బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవే.. (Aishwarya Panda/ HT Tech)

Best camera smartphones under 30,000 : మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో బెస్ట్ కెమెరా స్మార్ట్​ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే! దేశంలో రూ. 30వేల బడ్జెట్​లో బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

రూ.30,000 లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్​ఫోన్​..

వివో వీ30ఈ: వివో నుంచి కొత్తగా లాంచ్ అయిన మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​లో ఇది ఒకటి. వివో వీ30ఈ స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. కంటిన్యూస్ షూటింగ్, హై డైనమిక్ రేంజ్ మోడ్ (హెచ్డీఆర్), సూపర్మూన్ వంటి వివిధ షూటింగ్ మోడ్లను ఈ స్మార్ట్​ఫోన్ అందిస్తుంది. ముందువైపు వివో వీ30ఈ స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

రెడ్ మీ నోట్ 13 ప్రో+:స్మార్ట్​ఫోన్ ప్రత్యేకమైన డిజైన్, వాటర్ ప్రూఫ్ బ్యాక్ ప్యానెల్​తో వస్తుంది. రెడ్​మీ నోట్ 13 ప్రో ప్లస్​లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, శాంసంగ్ ఐసోసెల్ హెచ్పి 3 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, ఎ2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అదనంగా, ఇది 4 ఎక్స్ లాస్లెస్ ఇన్-సెన్సార్ జూమ్​ని అందిస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అద్భుతమైన సెల్ఫీలను క్యాప్చర్ చేస్తుంది.

OnePlus Nord CE 4 : వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4: అసాధారణ పనితీరు, కెమెరా సామర్థ్యాలతో ఈ ఏడాది ఈ స్మార్ట్​ఫోన్ లాంచ్ అయింది. వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 డ్యూయెల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ లైట్ 600 ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

టెక్నో కామోన్ 30: అద్భుతమైన కెమెరా సామర్థ్యాలను అందించే టెక్నో నుంచి వచ్చిన కొత్త మిడ్-రేంజ్ ఆఫర్ ఇది. టెక్నో కామోన్ 30 డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్ సపోర్ట్​తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అదనంగా, ఈ స్మార్ట్​ఫోన్ 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాతో వస్తుంది. ఇది మీ సెల్ఫీలను ఆకర్షణీయంగా, హై క్వాలిటీతో కనిపించేలా చేస్తుంది.

Realme 12 Pro+ రియల్​మీ 12 ప్రో+: గత ఏడాది లాంచ్ అయిన ఈ స్మార్ట్​ఫోన్ పనితీరు, కెమెరా విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా సెన్సార్, 64 మెగాపిక్సెల్ ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్​ని అందించారు.

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు లైవ్​ వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి..

Whats_app_banner

సంబంధిత కథనం