Oppo F27 Pro Plus 5G vs Samsung Galaxy F55 : ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ?-oppo f27 pro plus 5g vs samsung galaxy f55 which smartphone is a better choice under 30000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo F27 Pro Plus 5g Vs Samsung Galaxy F55 : ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ?

Oppo F27 Pro Plus 5G vs Samsung Galaxy F55 : ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ?

Sharath Chitturi HT Telugu
Jun 17, 2024 12:45 PM IST

Oppo F27 Pro Plus 5G : ఒప్పో ఎఫ్​27 ప్రో ప్లస్​ వర్సెస్​ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​ 55.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​55 వర్సెస్​ ఒప్పో ఎఫ్​27 ప్రో ప్లస్​..
శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​55 వర్సెస్​ ఒప్పో ఎఫ్​27 ప్రో ప్లస్​.. (Oppo India)

Oppo F27 Pro Plus 5G price in India : ఒప్పో ఇటీవలే కొత్త ఎఫ్-సిరీస్ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. దాని పేరు ఎఫ్ 27 ప్రో ప్లస్​. రూ. 30వేల బడ్జెట్​ మార్కెట్​లో దీని పట్ల కస్టమర్లలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ ఒప్పో ఎఫ్​27 ప్రో ప్లస్​ని శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55తో పోల్చి.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? అనేది ఇక్కడ తెలుసుకుందాము..

ఎఫ్ 27 ప్రో ప్లస్ వర్సెస్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55..

డిస్​ప్లే: ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​తో కూడిన 6.7 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ + కర్వ్డ్ ఓఎల్​ఈడీ డిస్ ప్లేను కలిగి ఉంది.

మరోవైపు.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 స్మార్ట్​ఫోన్​ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో 6.7 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్​ప్లే కలిగి ఉంది.

డిజైన్: ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​.. వేగన్ లెథర్ బ్యాక్​ను సపోర్ట్ చేస్తాయి. మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో ప్రీమియం, ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. అయితే, ఎఫ్ 27 ప్రో ప్లస్​కు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్​ లభిస్తుంది. ఐపి 69 రేటింగ్ వాటర్​ డస్ట్​ రెసిస్టెన్స్​ పొందింది. ఇది రెయిన్ ప్రూఫ్ స్మార్ట్​ఫోన్ గా మారింది. గెలాక్సీ ఎఫ్ 55 వెనుక ప్యానెల్​లో స్టిచ్ ప్యాట్రన్​తో మరింత ఎలివేటెడ్ డిజైన్​ వస్తుంది.

Oppo F27 Pro Plus 5G features : కెమెరా: ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ డ్యూయెల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

మరోవైపు, గెలాక్సీ ఎఫ్ 55 ట్రిపుల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


Samsung Galaxy F55 price in India : పర్ఫార్మెన్స్​: ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీతో పనిచేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 55 క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై ఈ రెండు ఫోన్లు పనిచేయనున్నాయి. స్టోరేజ్ పరంగా ఒప్పో స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్​ను అందిస్తుంది, శాంసంగ్ 12 జీబీ ర్యామ్​ను అందిస్తుంది.

బ్యాటరీ: శాశ్వత పనితీరు కోసం ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్, గెలాక్సీ ఎఫ్ 55, రెండు డివైజ్​లు 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఒప్పో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ను, శాంసంగ్ 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందిస్తోంది.

Samsung Galaxy F55 features : ధర: ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.27,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.26,999గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం