తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Magnetic Wireless Charging : మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తున్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్!

Magnetic Wireless Charging : మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తున్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్!

Anand Sai HT Telugu

07 October 2024, 15:44 IST

google News
  • OnePlus 13 Smartphone : వన్‌ప్లస్ 13 కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో దీనిని లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్

వన్‌ప్లస్ కొత్త ఫోన్.. వన్‌ప్లస్ 13 లాంచ్ కాబోతోంది. నివేదికల ప్రకారం, కంపెనీ ఈ ఫోన్‌ను ఈ నెలలో లాంచ్ చేయవచ్చు. అయితే లాంచ్ తేదీని ఇంకా ధృవీకరించలేదు. ఈ ఫోన్ బీఓఈ డిస్ ప్లేతో వస్తుందని కంపెనీ అధిపతి లూయిస్ లీ ఇటీవల ధృవీకరించారు. తాజాగా వన్‌ప్లస్ 13కు సంబంధించి ఛార్జింగ్ గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ ఫోన్ మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని లీ చెప్పారు. వన్‌ప్లస్ 13 వినియోగదారులు మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

కంపెనీకి చెందిన ఈ కొత్త ఫోన్ మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుందని కొంతకాలం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వన్‌ప్లస్ 13 గురించి లూయిస్ లీ ఈ సమాచారం ఇచ్చారు. ఛార్జింగ్‌తో పాటు, మాగ్నెటిక్ సిస్టమ్ వాలెట్ కేస్ వంటి యాక్ససరీల ఎంపికను కూడా వన్‌ప్లస్ అందించనుందని తెలుస్తోంది. లీ ప్రకటన తప్ప.. ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. వన్‌ప్లస్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ యాపిల్‌కు చెందిన MagSafeని పోలి ఉండే అవకాశం ఉంది.

లీకైన నివేదిక ప్రకారం వన్‌ప్లస్ ఈ ఫోన్‌లో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌ను అందించవచ్చు. ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వన్‌ప్లస్ 13 కెమెరాకు సంబంధించిన సమాచారం కూడా లీక్ వచ్చింది. దీని ప్రకారం ఎఫ్ / 1.6 ఎపర్చర్‌తో కూడిన ఎల్వైటీ-808 సెన్సార్‌ను ఇవ్వవచ్చు.

వన్‌ప్లస్ 12లో కంపెనీ అందిస్తున్న 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఇదే. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ బ్యాటరీ కూడా పవర్ ఫుల్‌గా ఉండబోతోంది. నివేదిక ప్రకారం ఈ ఫోన్లో 5400 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అందించబోతోంది. ఈ బ్యాటరీ 100 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

తదుపరి వ్యాసం