Infinix Hot 50 Pro Plus : ప్రపంచంలో అత్యంత సన్నని ఫోన్.. 16జీబీ ర్యామ్‌తో వస్తుంది!
Infinix Hot 50 Pro Plus : పండుగ సీజన్ కావడంతో కంపెనీలు తమ ఫోన్ల వివరాలను విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫినిక్స్‌కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
ఇన్ఫినిక్స్ తన పోర్ట్‌ఫోలియోను వేగంగా పెంచుకునే పనిలో పడింది. ఈ బ్రాండ్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌ను అక్టోబర్ 17న భారతదేశంలో విడుదల చేయనుంది. దీనితో పాటు ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్రో ప్లస్‌పై కూడా పని చేస్తుంది. ఇది ప్రపంచంలోనే సన్నని ఫోన్ అని కంపెనీ పేర్కొంది. కంపెనీ అధికారికంగా ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్రో ప్లస్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ ఇదేనని టీజర్‌లో కంపెనీ పేర్కొంది.
ఈ ఫోన్‌లో 16 జీబీ వరకు ర్యామ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్లో కనిపించే కొన్ని ప్రత్యేక ఫీచర్లను కూడా కంపెనీ హైలైట్ చేసింది. ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం ఏంటో చూద్దాం..
ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
టీజర్‌లో ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జి 100 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని పేర్కొంది. ఇది టీయూవీ సర్టిఫికేషన్ కారణంగా 5 సంవత్సరాల పనితీరును అందిస్తుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. ఇది టాప్-ఆఫ్-లైన్ చిప్ కానప్పటికీ, రోజువారీ పనులను సాధ్యమయ్యేలా చేయడానికి సరిపోతుందని తెలిపింది. ఇది కాకుండా ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్ (8 జీబీ స్టాండర్డ్ + 8 జీబీ వర్చువల్)తో 256 జిబి స్టోరేజ్ పొందుతుందని టీజర్ పేర్కొంది.
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్లో ఇన్ డిస్‌ప్లేలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండనుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ వివరాలు మాత్రమే కంపెనీ వెల్లడించింది. రాబోయే ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్రో ప్లస్ గురించి ప్రస్తుతానికి ఎక్కువ సమాచారం వెల్లడించలేదు.
ఇది కాకుండా అధికారిక లాంచ్ తేదీని ప్రస్తుతానికి వెల్లడించలేదు. కానీ ఇన్ఫినిక్స్ అధికారికంగా ఈ ఫోన్‌ను ఫిలిప్పీన్స్‌లో టీజ్ చేసింది. ఇది త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర సమాచారం కూడా ఇంకా అందుబాటులో లేదు. అయితే ఫోన్ స్పెసిఫికేషన్లు, ఇతర వివరాల ఆధారంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని భావిస్తున్నారు.