Smart Phone Discount : 16జీబీ ర్యామ్‌తో తక్కువ ధరకే 2 ఫోన్లు.. రూ.8499 చెల్లిస్తే చాలు-16gb smart phones available at just rupees 8499 without any offer middle class budget phones ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Phone Discount : 16జీబీ ర్యామ్‌తో తక్కువ ధరకే 2 ఫోన్లు.. రూ.8499 చెల్లిస్తే చాలు

Smart Phone Discount : 16జీబీ ర్యామ్‌తో తక్కువ ధరకే 2 ఫోన్లు.. రూ.8499 చెల్లిస్తే చాలు

Anand Sai HT Telugu
Aug 04, 2024 09:00 PM IST

Smart Phone Discount : తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటే మంచి ఆఫర్లు ఉన్నాయి. తొమ్మిది వేల కంటే తక్కువ ధరలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

16 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ ను అతి తక్కువ ధరకే కొనాలనుకుంటే మీకో శుభవార్త. 16 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్‌ను అమెజాన్‌లో ఎలాంటి ఆఫర్ లేకుండా కేవలం రూ.8499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లలో మీరు మంచి కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా చూడవచ్చు.

ఐటెల్ పీ55+ 4జీ, లావా ఓ2 పేరుతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో 16 జీబీ వరకు ర్యామ్ విత్ మెమొరీ ఫ్యూజన్ లభిస్తుంది. 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తున్న ఈ ఫోన్లలో మీరు గొప్ప కెమెరా, బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను చూడవచ్చు. ఈ రెండు ఫోన్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఐటెల్ పీ55+ 4జీ

ఎలాంటి ఆఫర్ లేకుండా అమెజాన్ ఇండియాలో రూ.8499కే లభిస్తుంది. ఈ ఫోన్లో 16 జీబీ వరకు ర్యామ్ విత్ మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీగా ఉంది. ఈ ఫోన్‌లో డైనమిక్ బార్‌తో కూడిన 6.6 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నారు. ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ను చూడొచ్చు. ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ 5000 ఎంఏహెచ్ గా ఉంది.

లావా ఓ2

అమెజాన్ ఇండియాలో రూ.8499కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధరలో ఎలాంటి ఆఫర్లు లేవు. ఈ ఫోన్‌లో 8 జీబీ రియల్, 8 జీబీ వర్చువల్ ర్యామ్‌ను కంపెనీ అందిస్తోంది. ఇందులో 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను అందించారు. 6.5 అంగుళాల పంచ్ హోల్ డిస్ ప్లేను చూడవచ్చు. ఈ ఫోన్ డిస్ ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. యూనిసోక్ టీ616 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కంపెనీ అందిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

టాపిక్