Smartphones Discount : ఐఫోన్ 13, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4పై భారీ ఆఫర్లు, రూ.9999కే శాంసంగ్ 5జీ ఫోన్
Smartphones Discount : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ ఉన్నాయి. ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై అందిస్తున్న టాప్ 3 డీల్స్ గురించి తెలుసుకుందాం.. బ్యాంక్ డిస్కౌంట్లు, మంచి క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తున్నారు. ఈ సేల్‌లో మీరు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లను చూడొచ్చు. అమెజాన్ ఈ బంపర్ సేల్‌లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. బ్యాంక్ డిస్కౌంట్లు, భారీ క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో శాంసంగ్ 5జీ ఫోన్ బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లతో కేవలం రూ.9,999కే లభిస్తుంది. ఈ డివైస్‌లపై విపరీతమైన ఎక్స్చేంజ్ బోనస్‌లు కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 13
ఐఫోన్ 13 128జీబీ స్టార్‌లైట్ కలర్ వేరియంట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో రూ.42,999కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్‌పై రూ.1250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై రూ.2150 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో మీరు రూ.39,650 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఫొటోగ్రఫీ కోసం 12 మెగాపిక్సెల్ వైడ్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్. ఐఫోన్ 13లో ప్రాసెసర్‌గా కంపెనీ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌ను అందిస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ
ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ ధర రూ.19,998గా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మీరు కూపన్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై రూ.999.90 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనితో మీకు వన్‌ప్లస్ బుల్లెట్స్ ఇయర్ ఫోన్స్ ఫ్రీగా లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.18,800 వరకు పొందొచ్చు. ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే లభిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ 5500ఎంఏహెచ్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ రూ.10,999కే లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ.250 కూపన్, రూ.750 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ కోసం, మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లించాలి. ఈ సేల్‌లో మీరు రూ.550 వరకు క్యాష్‌బ్యాక్‌తో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ డీల్స్‌లో కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్లో మీకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది.