తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia X30 5g Price Cut : నోకియా ఎక్స్​30 5జీపై భారీ తగ్గింపు.. ఇప్పుడు కొనొచ్చా?

Nokia X30 5G price cut : నోకియా ఎక్స్​30 5జీపై భారీ తగ్గింపు.. ఇప్పుడు కొనొచ్చా?

Sharath Chitturi HT Telugu

23 April 2023, 10:25 IST

    • Nokia X30 5G price cut : నోకియా ఎక్స్​30 5జీ ధర భారీగా తగ్గింది. ఫలితంగా ధర రూ. 40వేల కన్నా తక్కువగా చేరింది. పూర్తి వివరాలు..
నోకియా ఎక్స్​30 5జీపై భారీ తగ్గింపు
నోకియా ఎక్స్​30 5జీపై భారీ తగ్గింపు (Representative image )

నోకియా ఎక్స్​30 5జీపై భారీ తగ్గింపు

Nokia X30 5G price cut : ఇండియా మార్కెట్​లో ఎక్స్​30 5జీ స్మార్ట్​ఫోన్​ ధరను భారీగా తగ్గించింది నోకియా. తాజా తగ్గింపుతో రూ. 40వేల సెగ్మెంట్​లోకి చేరింది ఈ గ్యాడ్జెట్​. రీసైకిల్డ్​ మెటీరియల్స్​తో తయారు చేసిన ఈ మొబైల్​ ధర రూ. 12వేలు తగ్గింది. మరి ఇప్పుడు ఈ గ్యాడ్జెట్​ను కొనుగోలు చేయవచ్చా?

నోకియా ఎక్స్​30 5జీ- స్పెసిఫికేషన్స్​..

నోకియా ఎక్స్​30 5జీలో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కట్​-ఔట్​, ఫింగర్​ప్రింట్​ స్కానర్​లు ఉన్నాయి. ఐపీ67 రేటెడ్​ వాటర్​ రెసిస్టెన్స్​ లభిస్తోంది. 100శాతం రీసైకిల్డ్​ అల్యుమీనియం ఫ్రైమ్​ ఈ మొబైల్​లో ఉంది. ఇందులో ప్లాస్టిక్​ బాడీలో 65శాతం రీసైకిల్డ్​ మెటిరీయల్స్​నే వినియోగించారు.

Nokia X30 5G price in India : ఈ డివైజ్​లో 6.43ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ (1080X2400 పిక్సెల్స్​) అమోలెడ్​ స్క్రీన్​ ఉంటుంది. కార్నెరింగ్​ గొరిల్లా గ్లాస్​ విక్టర్​ ప్రొటక్షన్​ సైతం లభిస్తోంది.

ఇదీ చదవండి:- Nokia C12 Plus: నోకియా సీ12 లైనప్‍లో మూడో ఫోన్ లాంచ్.. ఇది కూడా బడ్జెట్ రేంజ్‍లోనే..

నోకియా ఎక్స్​30 5జీలో 50ఎంపీ ప్రైమరీ, 13ఎంపీ సెకండరీ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ ఉంది. 8జీబీ ర్యామ్​/ 256జీబీ స్టోరేజ్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 12ఓఎస్​పై ఇది పనిచేస్తుంది. 4,200ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంది. 33డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జర్​ కూడా వస్తోంది. డ్యూయెల్​ సిమ్​ స్లాట్​, వైఫై-6, బ్లూటుత్​ 5.1, జీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, టైప్​-సీ పోర్ట్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి.

నోకియా ఎక్స్​30 5జీ- ధర..

Nokia X30 5G features : నోకియా ఎక్స్​30 5జీ ధర లాంచ్​ సమయంలో రూ. 48,999గా ఉండేది. తాజా రూ. 12వేల తగ్గింపుతో ఈ ధర రూ. 36,999కే చేరింది. క్లౌడీ బ్లూ, ఐస్​ వైట్​ రంగుల్లో ఈ డివైజ్​ అమెజాన్​తో పాటు నోకియా అఫీషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం