iQoo Neo 6 5G Price Cut: ఐకూ నియో 6 5జీ ధర తగ్గింది: నియో 7 రాకతో..
04 April 2023, 16:13 IST
- iQoo Neo 6 5G Price Cut: ఐకూ నియో 6 5జీ ధర దిగొచ్చింది. నియో 7 5జీని ఇటీవల లాంచ్ చేసిన ఐకూ.. తాజాగా గత మోడల్ ధరను తగ్గించింది.
iQoo Neo 6 5G Price Cut: ఐకూ నియో 6 5జీ ధర తగ్గింది (Photo: iQoo)
iQoo Neo 6 5G Price Cut: గతేడాది లాంచ్ అయి ఎంతో పాపులర్ అయిన ఐకూ నియో 6 5జీ (iQoo Neo 6 5G) స్మార్ట్ ఫోన్ ధర తాజాగా తగ్గింది. ఇటీవల ఐకూ నియో 7 5జీ లాంచ్ అవడంతో ఈ నియో 6 ధరను ఐకూ ఇప్పుడు తగ్గించింది. లాంచ్ అయి సంవత్సరం అయినా.. తగ్గింపు తర్వాత ఇప్పటికీ నియో 6 5జీ మంచి ఆప్షన్‍గానే కనిపిస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉండే ప్రైమరీ కెమెరా, గేమింగ్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఐకూ నియో 6 5జీ ధర తగగ్గా.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐకూ నియో 6 5జీ ధర ప్రస్తుతం ఎంత ఉంది, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
ఐకూ నియో 6 5జీ ధర
iQoo Neo 6 5G Price Cut: 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న ఐకూ నియో 6 5జీ బేస్ వేరియంట్ ధర రూ.24,999కు దిగివచ్చింది. ఇటీవలి వరకు దీని సాధారణ ధర రూ.29,999గా ఉంది. అంటే సుమారు రూ.5వేల ధరను ఐకూ ఇప్పుడు తగ్గించింది. ఇక 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర కూడా రూ.4వేలు తగ్గి రూ.29,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍తో పాటు ఐకూ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ కొత్త రేట్లతో ఐకూ నియో 6 5జీ లభిస్తోంది.
ఐకూ నియో 6 5జీ స్పెసిఫికేషన్లు
iQoo Neo 6 5G Specifications: 6.62 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ E4 AMOLED డిస్‍ప్లేను ఐకూ నియో 6 4జీ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‍డీఆర్10+ సపోర్ట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటాయి. క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతోంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‍టచ్ ఓఎస్‍తో ఈ మొబైల్ వస్తోంది. ఆండ్రాయిడ్ 13కు అప్‍డేట్ చేసుకోవచ్చు.
ఐకూ నియో 6 5జీ ఫోన్‍లో 4,700mAh బ్యాటరీ ఉండగా.. 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఈ ఫోన్‍లో ఉంటుంది. హై-రెస్ ఆడియో ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
ఐకూ నియో 6 5జీ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. OIS సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ Samsung GW1P ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్ కలిగి ఉంది.
ఐకూ నియో 7 5జీ (iQoo Neo 7 5G) ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమన్సిటీ 8200 ప్రాసెసర్‌తో వచ్చింది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.