Nokia C12 Pro | బడ్జెట్ రేంజ్‍లో నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే!-nokia c12 pro price in india specification features full details
Telugu News  /  Business  /  Nokia C12 Pro Price In India Specification Features Full Details
Nokia C12 Pro: బడ్జెట్ రేంజ్‍లో నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ (Photo: Nokia)
Nokia C12 Pro: బడ్జెట్ రేంజ్‍లో నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ (Photo: Nokia)

Nokia C12 Pro | బడ్జెట్ రేంజ్‍లో నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే!

22 March 2023, 13:58 ISTChatakonda Krishna Prakash
22 March 2023, 13:58 IST

Nokia C12 Pro: నోకియా సీ12 లైనప్‍లో ప్రో మోడల్ వచ్చేసింది. బడ్జెట్ రేంజ్‍లో లాంచ్ అయింది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇవే.

Nokia C12 Pro: నోకియా సీ12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ రేంజ్‍లో అడుగుపెట్టింది. ఇటీవలే సీ12ను విడుదల నోకియా.. దీనికి ఇప్పుడు 12 ప్రో మోడల్‍ను తెచ్చింది. ఇది కూడా 4జీ ఫోన్‍గానే ఉంది. క్యాండీ బార్ డిజైన్‍ను నోకియా సీ12 ప్రో కలిగి ఉంది. వెనుక ఒకే కెమెరా ఉంటుంది. మూడు కలర్ ఆప్షన్‍లలో లభ్యమవుతోంది. నోకియా సీ12 ప్రో ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.

నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్లు

Nokia C12 Pro Specifications: నోకియా సీ12 ప్రో 6.3 ఇంచుల హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను కలిగి ఉంది. స్డాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ (Android 12 Go Edition) ఆపరేటింగ్ సిస్టమ్‍పై ఈ ఫోన్ రన్ అవుతుంది. రెండు సంవత్సరాల పాటు ఈ ఫోన్‍కు రెగ్యులర్ సెక్యూరిటీ అప్‍డేట్లను ఇవ్వనున్నట్టు నోకియా స్పష్టం చేసింది. UniSoC 9863A1 ప్రాసెసర్‌ ఈ ఫోన్‍లో ఉంటుంది. డ్యుయల్ సిమ్ 4జీకి సపోర్ట్ చేస్తుంది.

Nokia C12 Pro Details: నోకియా సీ12 ప్రో ఫోన్‍లో 4,000mAh బ్యాటరీ ఉంది. స్టాండర్డ్ 10 వాట్ల చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 64జీబీ స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంటుంది.

నోకియా సీ12 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. చిన్నపాటి నీటి బిందువుల నుంచి రక్షణ ఉండేలా ఐపీ52 రేటింగ్‍తో ఈ మొబైల్ వస్తోంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. ఈ ఫోన్ 171 గ్రాముల బరువు ఉంటుంది.

నోకియా సీ12 ప్రో ధర, సేల్

Nokia C12 Pro Price, Sale: నోకియా సీ12 ప్రో 2జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.6,999గా ఉంది. 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.7,499 ధరతో వచ్చింది. నోకియా వెబ్‍సైట్, ఆఫ్‍లైన్ స్టోర్లలో ఈ ఫోన్ ఇప్పటికే సేల్‍కు వచ్చింది. లైట్ మింట్, చార్కోల్, డార్క్ సియాన్ కలర్ ఆప్షన్‍లలో Nokia C12 Pro లభిస్తోంది.

సంబంధిత కథనం