Google Pixel Tablet : గూగుల్ పిక్సెల్ ట్యాబ్.. లాంచ్ ఎప్పుడంటే..!
Google Pixel Tablet price : గూగుల్ పిక్సెల్ ట్యాబ్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ డివైజ్‌పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
Google Pixel Tablet India : గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ లాంచ్‌కు సిద్ధమవుతోందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మే 10న జరగబోయే ఓ ఈవెంట్లో గూగుల్ పిక్సెల్ 7ఏ, పిక్సెల్ ఫోల్డ్‌తో పాటు ఈ పిక్సెల్స్ ట్యాబ్ కూడా లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాము..
గూగుల్ పిక్సెల్ ట్యాబ్..
కన్వెన్షనల్ రెక్టాంగ్యులర్ డిజైన్, నానో- సెరామిక్ ఫినిష్, సిమ్మెట్రిక్ బార్డర్స్, కర్వ్డ్ కార్నర్స్, టాప్ సెంటర్డ్ కెమెరాతో ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ ఆకర్షణీయంగా ఉంటుంది. రేర్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన సింగిల్ కెమెరా ఉండనుంది. 10.95 ఇంచ్ క్యూహెచ్డీ+ (1600X2560 పిక్సెల్స్) టచ్‌స్క్రీన్ ఇందులో ఉండొచ్చు. గ్రీన్ హేజ్, పార్సలీన్తో పాటు మరో రెండు రంగుల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి:- Smartphone launches in May : మే నెలలో లాంచ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Google Pixel Tablet launch : ఇక ఈ పిక్సెల్ ట్యాబ్లెట్లో టెన్సార్ జీ2 ఎస్ఓసీ ఉండనుంది. 8జీబీ ర్యామ్‌తో 128జీబీ/ 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ లభించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13పై ఈ డివైజ్ నడుస్తుంది. యూఎస్ఐ 2.1 స్టైలస్, 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.
గూగుల్ పిక్సెల్ ట్యాబ్- ధర..
ప్రముక టిప్‌స్టర్ రోనాల్డ్ క్వాండ్ ప్రకారం పిక్సెల్ ట్యాబ్ 128జీబీ లేదా 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఒకదానికి 600-650 యూరోల ధర ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ. 54,100- రూ. 58,600. ఇదే ధరతో లాంచ్ అయితే.. మార్కెట్లో లభిస్తున్న ఇతర ట్యాబ్స్‌తో పోల్చి చూస్తే.. ఈ డివైజ్ కాస్త ఖరీదుగానే ఉంటుంది.
లాంచ్ టైమ్ దగ్గరపడే కొద్ది.. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వస్తాయి.
గూగుల్ పిక్సెల్ 7ఏ..
Google Pixel 7A launch date : గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్.. మే 10న జరగనుంది. ఈ ఈవెంట్లోనే పిక్సెల్ 7ఏని గూగుల్ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో.. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.1 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్787 కెమెరా, లేటెస్ట్ టెన్సార్ జీ2 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉండొచ్చు. డిజైన పరంగా.. ఈ కొత్త మోడల్ గూగుల్ పిక్సెల్ 7ని పోలి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
సంబంధిత కథనం