తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia C300 Launch : మరో రెండు బడ్జెట్​ ఫోన్స్​ను లాంచ్​ చేసిన నోకియా..

Nokia C300 launch : మరో రెండు బడ్జెట్​ ఫోన్స్​ను లాంచ్​ చేసిన నోకియా..

Sharath Chitturi HT Telugu

03 June 2023, 10:35 IST

    • Nokia C300 C110 launch : బడ్జెట్​ సెగ్మెంట్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​ను లాంచ్​ చేసింది నోకియా. వాటి వివరాలు, ఫీచర్స్​, ధర ఇక్కడ తెలుసుకుందాము.. 
మరో రెండు బడ్జెట్​ ఫోన్స్​ను లాంచ్​ చేసిన నోకియా..
మరో రెండు బడ్జెట్​ ఫోన్స్​ను లాంచ్​ చేసిన నోకియా.. (Representative image)

మరో రెండు బడ్జెట్​ ఫోన్స్​ను లాంచ్​ చేసిన నోకియా..

Nokia C300 C110 launch : రెండు కొత్త బడ్జెట్​​ స్మార్ట్​ఫోన్​ను తాజాగా లాంచ్​ చేసింది హెచ్​ఎండీ గ్లోబల్​. వీటి పేర్లు నోకియా సీ300, నోకియా సీ110. ఈ ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్స్​.. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఇతర దేశాల్లో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

నోకియా సీ110- ఫీచర్స్​..

Nokia C110 features : నోకియా సీ110లో హెచ్​డీ+ రిసొల్యూషన్​తో కూడిన 6.3 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ హీలియో పీ22 ఎస్​ఓసీ చిప్​సెట్​ దీని సొంతం. 3జీబీ ర్యామ్​- 32జీబీ స్టోరేజ్​ ఇందులో ఉంది. 256జీబీ ఎక్స్​పాండెబుల్​ మైక్రోఎస్​డీ కార్డ్​ స్లాట్​ లభిస్తోంది. రేర్​లో 13ఎంపీ కెమెరా, ఫ్రెంట్​లో 5ఎంపీ కెమెరాలు వస్తున్నాయి.

నోకియా సీ110లో ఆండ్రాయిడ్​ 12 ఓఎస్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​, ఎఫ్​ఎం రేడియో, ఐపీ52 రేటెడ్​ స్ప్లాష్​ రెసిస్టెన్స్​ వంటివి వస్తున్నాయి. 3000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 5వాట్​ ఛార్జింగ్​ లభిస్తోంది.

ఇదీ చూడండి:- Nokia C32: బడ్జెట్ ధరలో నోకియా నుంచి మరో ఫోన్ వచ్చేసింది: వివరాలివే

నోకియా సీ300- ఫీచర్స్​..

Nokia C300 feature : నోకియా సీ300లో హెచ్​డీ+ 6.52 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 662 ఎస్​ఓసీ ప్రాసెసర్​ లభిస్తోంది. 3జీబీ ర్యామ్​- 32జీబీ స్టోరేజ్​తో పాటు ఎక్స్​పాండెబుల్​ మైక్రోకార్డ్​ వస్తోంది. ఆండ్రాయిడ్​ 12పై ఇది పనిచేస్తుంది. 4000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 10వాట్​ ఛార్జింగ్​కు ఈ స్మార్ట్​ఫోన్​ సపోర్ట్​ చేస్తుంది.

3.55ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​, ఎఫ్​ఎం రేడియో, రేర్​లో 13ఎంపీ ట్రిపుల్​ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ వంటివి ఉన్నాయి.

నోకియా సీ300, సీ110 ధరలు..

అమెరికాలో నోకియా సీ110 ధర 99 డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ. 8,150. ఇక నోకియా సీ300 ధర 139 డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ. 11,450.

Nokia C300 price : ఇక ఈ స్మార్ట్​ఫోన్స్​ ఇండియాలో ఎప్పుడు లాంచ్​ అవుతాయి? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

తదుపరి వ్యాసం