Maruti Swift 2024 : సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్ బుకింగ్స్ షురూ.. లాంచ్ ఎప్పుడంటే!
19 April 2024, 12:10 IST
- 2024 Maruti Swift bookings : మారుతీ సుజుకీ 2024 బుకింగ్స్ మొదలయ్యాయి. టోకెన్ అమౌంట్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త మారుతీ సుజుకీ బుకింగ్స్ షురూ..
Maruti Swift on road price Hyderabad : 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్‌పై ఇప్పటికే చాలా బజ్ నెలకొంది. ఈ బెస్ట్ సెల్లింగ్ హ్యాట్బ్యాక్.. మే 9న ఇండియాలో లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది. వీటన్నింటి మధ్య.. ఈ కారుకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. పలు ఎంపిక చేసిన డీలర్షిప్ షోరూమ్స్‌లో.. లాంచ్‌కు ముందే ప్రీ-బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్‌ను.. ఎంపిక చేసిన మారుతి సుజుకి ఎరీనా డీలర్షిప్ షోరూమ్స్‌లో రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. ధరలు లేదా డెలివరీలపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్..
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ గురించి వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, కొత్త తరం మోడల్ మల్టీ వేరియంట్లతో పాటు అనేక కలర్ ఆప్షన్లలో వస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. విజువల్‌గా, ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్.. కొత్త గ్రిల్, బంపర్స్, అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటీనాతో పాటు మెరుగైన ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సీ-పిల్లర్‌పై అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్ ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్ మోడల్లో కనిపిస్తాయి.
కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్‌లో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కొత్తగా ఉండొచ్చు. ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. సీటు, అప్హోల్ స్టరీ మెటీరియల్ కూడా రిఫ్రెషింగా ఉన్నాయి.
ఇదీ చూడండి:- Most unsafe cars in India : ఈ కార్లు కొంటే.. ప్రాణాలు గాల్లోనే! భద్రతలో ‘0’ రేటింగ్..
2024 Maruti Suzuki Swift bookings :ఇక సేఫ్టీ విషయానికొస్తే.. కొత్త స్విఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్పీ స్టాండర్డ్‌గా, రెండవ వరుసలో సెంటర్ ప్యాసింజర్ కోసం మూడు పాయింట్ల సీట్ బెల్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇండియా-స్పెక్ స్విఫ్ట్ గ్లోబల్ మోడల్లో అందుబాటులో ఉన్న 360 డిగ్రీల కెమెరా, అడాస్ వంటివి ఇందులో ఉండకపోవచచు.
2024 Maruti Suzuki Swift : కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో.. కొత్త జడ్-సిరీస్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ని ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రస్తుత మోడల్లోని కే12 నాలుగు సిలిండర్ల పెట్రోల్ యూనిట్ స్థానంలో వస్తుంది. కొత్త ఇంజిన్.. పవర్- టార్క్ అవుట్‌పుట్.. కే12 యూనిట్ ఉత్పత్తి చేసే విధంగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఇంజిన్.. గరిష్టంగా 89బీహెచ్పీ పవర్, 113ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. కొత్త స్విఫ్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, ఏఎమ్‌టీ ఆప్షన్ అందుబాటులో ఉంటాయని ఆశించవచ్చు. అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండే మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ అతిపెద్ద హైలైట్!