Yamaha RX100 : రెట్రో బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్- యమహా ఆర్ఎక్స్100 వచ్చేస్తోంది!
20 February 2024, 11:56 IST
- Yamaha RX100 new : ‘యమహా100 మళ్లీ లాంచ్ అయితే ఎంత బాగుంటుందో!' అని ఆలోచిస్తున్నారా? అయితే.. మీ కల నెరవేరబోతోంది! సరికొత్త అవతారంలో యమహా ఆర్ఎక్స్100ని సంస్థ రూపొందిస్తోందట!
రెట్రో బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్- యమహా ఆర్ఎక్స్100 వచ్చేస్తోంది!
New Yamaha RX100 : రెట్రో బైక్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చే వార్త! యమహా ఆర్ఎక్స్100ని మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు.. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. వెహికిల్‌కి అప్డేట్స్ చేసి మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
యమహా ఆర్ఎక్స్100 వచ్చేస్తోంది..!
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో యమహా ఆర్ఎక్స్100 ఓ వెలుగు వెలిగిందనే చెప్పుకోవాలి! ఎఫీషియెన్సీకి మారుపేరుగా నిలిచింది ఈ బైక్. ఇక.. జపాన్‌కు చెందిన 2 వీలర్ తయారీ సంస్థ యమహా.. 1996 మార్చ్‌లో ఈ బైక్ ప్రొడక్షన్‌ని ఆపేసింది. కానీ.. భారతీయులు మాత్రం ఇప్పటికీ ఈ 2 వీలర్‌ని మర్చిపోలేదు! రెట్రో బైక్స్ అనగానే మొదట గుర్తు వచ్చే వెహికిల్స్‌లో ఇది ఒకటి.
ఇక ఇప్పుడు.. బీఎస్6 ఫేస్ 2 ఎమిషన్ రూల్స్‌కి తగ్గట్టుగా మోటార్‌సైకిల్‌ని రూపొందించాలని యమహా చూస్తోందట. ఇందులో 225.9 సీసీ ఇంజిన్ని వాడాలని ప్లాన్ చేస్తోందట. ఈ ఇంజిన్.. 20.1 హెచ్‌పీ పవర్‌ని, 19.93 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా.. పేరూ కూడా మారే అవకాశం ఉంది!
Yamaha RX100 225 cc : నివేదికల ప్రకారం.. ఐకానిక్ ఆర్ఎక్స్100 ఆధారంగా రూపొందుతున్న ఈ బైక్.. ఒరిజినల్ మోటార్‌సైకిల్‌లోని కొన్ని కీలక స్టైలింగ్ ఎలిమెంట్స్‌ని కొనసాగిస్తుంది. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.25 లక్షలు- రూ. 1.50 లక్షల మధ్యలో ఉండొచ్చు. ఎఫార్డెబులిటీ, ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్.. ఈ రెండింటినీ కలగలిపి, ప్రైజ్‌ని ఫిక్స్ చేయాలని సంస్థ చూస్తోంది.
అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. కొత్త ఆర్ఎక్స్100పై యమహా సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్ వస్తుందని సమాచారం.
Yamaha RX100 price : ఒరిజినల్ యమహా ఆర్ఎక్స్100లో స్లీక్, లైట్‌వెయిట్ డిజైన్ ఉండేది. సౌండ్, పవర్ కారణంగా చాలా ఫేమస్ అయ్యింది. బైక్ లవర్స్‌కి ఈ వెహికిల్ దగ్గరవ్వడానికి కారణం ఇవే! వీటిని రీక్రియేట్ చేయాలంటే.. కొత్త టెక్నాలజీకి మార్పులు చేయాలి. ముఖ్యంగా.. బైక్‌లో కనీసం 200 సీసీ ఇంజిన్ ఉండాలి. అదే సమయంలో.. బరువు కూడా ఎక్కువగా ఉండకూడదు.
నాటి యమహా ఆర్ఎక్స్100.. 100 సీసీ సెగ్మెంట్లో ఉండేది. అందులో.. 98.2 సీసీ 2 స్ట్రోక్ మోటార్ ఉండేది. కానీ ఇప్పుడు.. ఆ ఇంజిన్ని సంస్థ వాడకపోవచ్చు. అంటే.. 100 సీసీ సెగ్మెంట్ నుంచి యమహా ఆర్ఎక్స్100 తప్పుకుంటున్నట్టే!
New Yamaha rx100 launch date : ఏది ఏమైనా.. ఆర్ఎక్స్100 తిరిగొస్తోందన్న వార్తలు.. బైక్ లవర్స్‌కి మంచి కిక్ ఇస్తున్నాయి. నివేదికలు నిజమే అయితే.. ఇప్పుడు కూడా ఈ బైక్‌కి మంచి డిమాండ్ ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు!