Yamaha R3 launch : ఒకేసారి రెండు స్టైలిష్ బైక్స్‌ని లాంచ్ చేసిన యమహా..
Yamaha R3 launch : యమహా ఆర్3, ఎంటీ-03 బైక్స్ ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Yamaha R3 launch : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ యమహా మోటార్ ఇండియా నుంచి ఒకేసారి రెండు స్టైలిష్ బైక్స్ లాంచ్ అయ్యాయి. అవి.. యమహా ఆర్3, యమహా ఎంటీ-03. ఫలితంగా ఎన్నో నెలల పాటు వీటి కోసం సాగిన నిరీక్షణకు తెరపడింది. రెండు బైక్స్‌కి సంబంధించిన బుక్స్ మొదలయ్యయి. యమహా బ్లూ స్క్వేర్ డీలర్షిప్షోరూమ్స్లో వెహికిల్‌ని బుక్ చేసుకోవచ్చు. కాగా ఈ మోడల్స్‌ని సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో ఇండియాలోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బైక్స్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.
యమహా ఆర్3.. ఎంటీ-03 స్పెసిఫికేషన్స్..
యమహా ఆర్3 బైక్‌లో డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఇందులో 321 సీసీ, ప్యారలెల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 40.5 హెచ్‌పీ పవర్‌ని, 29.4 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. సస్పెన్షన్ కోసం ఇన్వర్టెడ్ ఫ్రెంట్ ఫోర్క్స్, రేర్ మోనో షాక్ అబ్సార్పర్స్ ఉంటాయి. ఫ్రెంట్- రేర్ వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. ఇందులో డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంది. 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్ ఆప్షన్ లభిస్తోంది.
Yamaha MT-03 launch ఇక యమహా ఎంటీ-03లో ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులో కూడా 321 సీసీ, ప్యారలెల్ ప్యారలెల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ లభిస్తోంది. సస్పెన్షన్, బ్రేకింగ్ వంటివి యమహా ఆర్3ని పోలి ఉంటాయి. 17 ఇంచ్ డిజైనర్ వీల్స్ లభిస్తున్నాయి.
ఇదీ చూడండి:- Kia Sonet facelift vs Tata Nexon : ఈ రెండు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్స్లో ఏది బెస్ట్?
యమహా కొత్త బైక్స్ ధరల వివరాలు..
Yamaha R3 on road price in India : యమహా ఆర్3 ఎక్స్‌షోరూం ధర రూ. 4.65లక్షలు. యమహా ఎంటీ-03 ఎక్స్‌షోరూం ధర రూ. 4.60లక్షలు. ఈ రెండు బైక్స్ ధరలు కాస్త ఎక్స్‌పెన్సివ్‌గానే ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. డిమాండ్ పెరిగితే, ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం