తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Dzire : సరికొత్త అవతారంలో బెస్ట్​ ఫ్యామిలీ కారు- లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే

Maruti Suzuki Dzire : సరికొత్త అవతారంలో బెస్ట్​ ఫ్యామిలీ కారు- లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే

Sharath Chitturi HT Telugu

26 October 2024, 10:26 IST

google News
    • 2024 Maruti Suzuki Dzire బెస్ట్​ సెల్లింగ్​, మిడిల్​క్లాస్ వారికి ప్రియమైన వెహికిల్​గా గుర్తింపు పొందిన​ మారుతీ సుజుకీ డిజైర్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోందన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మోడల్​ లాంచ్​ డేట్​ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు..
2024 మారుతీ సుజుకీ డిజైర్​
2024 మారుతీ సుజుకీ డిజైర్​

2024 మారుతీ సుజుకీ డిజైర్​

2024లో మచ్​ అవైటెడ్​ వెహికిల్స్​లో మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ ఒకటి. ఇక ఎట్టకేలకు ఈ మోడల్​ లాంచ్​ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ననవంబర్​ 11న 2024 మారుతీ సుజుకీ డిజైర్​ లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ కారుపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024 మారుతి సుజుకి డిజైర్: ఎక్ట్సీరియర్

మారుతీ సుజుకీ స్విఫ్ట్​తో ప్రస్తుత జనరేషన్​ డిజైర్​కి చాలా పోలీకలు ఉంటాయి. అయితే న్యూ జనరేషన్​లో భారీ మార్పులే జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా స్పై షాట్స్​ ఆధారంగా రాబోయే మారుతీ సుజుకీ డిజైర్ మరింత దృఢమైన డిజైన్ సౌందర్యాన్ని కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో అనేక హారిజాంటల్ క్రోమ్ స్లాట్లతో అలంకరించిన పెద్ద గ్రిల్, డే టైమ్​ రన్నింగ్ లైట్లు (డీఆర్ఎల్), ఫాగ్ లైట్లతో కూడిన అప్డేటెడ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్ ఉన్నాయి. అదనంగా, కాంపాక్ట్ సెడాన్ కొత్త అల్లాయ్ వీల్స్, ఎల్​ఈడీ టెయిల్​లైట్లతో రీడిజైన్ చేసిన రేర్​ భాగం, షార్క్-ఫిన్ యాంటెనాను కలిగి ఉంటుంది.

2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంజిన్​..

మారుతీ సుజుకీ డిజైర్ నెక్ట్స్​ జనరేషన్​.. కొత్తగా విడుదలైన స్విఫ్ట్ హ్యాచ్​బ్యాక్ మాదిరిగానే అదే ప్లాట్​ఫామ్​ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ 1.2-లీటర్, మూడు సిలిండర్ల జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్​ని కలిగి ఉన్న రెండొవ వాహనంగా మారుతుంది. స్విఫ్ట్​లో ఈ ఇంజిన్ గరిష్టంగా 80బీహెచ్​పీ పవర్, 112ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుబాటులో ఉన్న ట్రాన్స్​మిషన్​ ఆప్షన్స్​లో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్​టీ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో సీఎన్జీ ఇంజిన్​ కూడా ఉండనుందని సమాచారం.

2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంటీరియర్..

2024 మారుతీ సుజుకీ డిజైర్ ఇంటీరియర్ గణనీయమైన రీడిజైన్​ని పొందే అవకాశం ఉంది. ఇందులో 360-డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాహనంలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు అనుకూలమైన ఫ్లోటింగ్ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, స్పోర్టీ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. హెడ్-అప్ డిస్​ప్లే, సొగసైన డ్యూయల్-టోన్ బీజ్, బ్లాక్ ఇంటీరియర్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇండియాలో మిడ్​క్లాస్​, బెస్ట్​ సెల్లింగ్​ వాహనాల్లో ఒకటి ఈ మారుతీ సుజుకీ డిజైర్​. ఇక ఇప్పుడు దీని ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్స్​తో పాటు మరిన్ని వివరాలపై లాంచ్​ సమయానికి ఒక క్లారిటీ వస్తుంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్​ చేస్తాము.

తదుపరి వ్యాసం