తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Car Discount : మారుతి కారుపై క్రేజీ ఆఫర్.. భారీ డిస్కౌంట్.. యాక్ససరీలు ఫ్రీ!

Maruti Car Discount : మారుతి కారుపై క్రేజీ ఆఫర్.. భారీ డిస్కౌంట్.. యాక్ససరీలు ఫ్రీ!

Anand Sai HT Telugu

23 October 2024, 14:00 IST

google News
    • Maruti Car Discount Offer : మారుతి సుజుకి ఇండియా అమ్మకాలను పెంచుకోవడానికి ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేస్తోంది. అందులో భాగంగా స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీనిపై డిస్కౌంట్ ప్రకటించింది.
మారుతి  స్విఫ్ట్ బ్లిట్జ్‌పై డిస్కౌంట్
మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్‌పై డిస్కౌంట్

మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్‌పై డిస్కౌంట్

మారుతి సుజుకి ఇండియా తన అమ్మకాలను పెంచుకోవడానికి అనేక ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేస్తోంది. మరోవైపు ఈ ఎడిషన్ల కిట్లను కూడా వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నారు. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ కిట్ యాక్ససరీలను కంపెనీ ఈ నెలలో విడుదల చేసింది. ఈ మోడల్‌పై కూడా కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. దీనిపై కంపెనీ సుమారు రూ.70 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అదనపు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లతో ఉచిత యాక్సెసరీస్ ప్యాక్ కూడా ఉంది. ఈ దీపావళికి మారుతి కారును కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది.

స్విఫ్ట్ బ్లిట్జ్ ఫీచర్ల గురించి చూస్తే.. బ్లిట్జ్ వెనుక అండర్ బాడీ స్పాయిలర్, బూట్ పైన ఒకటి, ఫాగ్ ల్యాంప్స్, ప్రకాశవంతమైన డోర్ సిల్స్, డోర్ వైజర్లు, మౌల్డింగ్స్ ఉన్నాయి. కంపెనీ గత నెలలో సీఎన్జీ వేరియంట్‌ను కూడా ఇందులో జోడించింది. ఇది 1.2-లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్‌పై 82 బీహెచ్పీ.. 112 ఎన్ఎమ్, సీఎన్జీపై 70 బీహెచ్పీ.. 112 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ రూపంలో ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను పొందుతుంది. బేస్ వేరియంట్ మినహా అన్నింటిలో 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ ఉంది.

కొత్త స్విఫ్ట్ భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది హిల్ హోల్డ్ కంట్రోల్, ఈఎస్పీ, కొత్త సస్పెన్షన్, అన్ని వేరియంట్లకు 6 ఎయిర్ బ్యాగులను పొందుతుంది. క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), బ్రేక్ అసిస్ట్ (బీఏ) వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్విఫ్ట్ బ్లిట్జ్ కారును మొత్తం 5 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో LXI, VXI, VXI AMT, VXI(O), VXI(O) AMT ఉన్నాయి.

స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ అదే జెడ్-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 80.46 బిహెచ్‌పీ పవర్, 111.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ యూనిట్ అందిస్తుంది. ఇది మాన్యువల్‌లో 24.80 కిమీ, ఆటోమేటిక్‌లో 25.75 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి 8.02 లక్షల వరకు ఎక్స్‌ షోరూమ్‌గా ఉంటుంది. ఇంజిన్, పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు.

ఇందులో క్యాష్ డిస్కౌంట్, అడిషనల్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, పండుగ డిస్కౌంట్ అన్ని కలిపి ఉంటాయి. మాన్యువల్, ఆటోమేటిక్‌ మీద ఆధారపడి డిస్కౌంట్ మారుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం దగ్గరిలోని డిలర్‌షిప్‌ను సంప్రదించండి.

తదుపరి వ్యాసం