Maruti Suzuki Dzire facelift : సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు!-maruti suzuki dzire facelift exterior interior revealed in latest spyshot leaks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Dzire Facelift : సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు!

Maruti Suzuki Dzire facelift : సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2024 11:22 AM IST

Maruti Suzuki Dzire facelift 2024 : మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్​లిఫ్ట్ వర్షెన్​ లాంచ్​కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన అనేక కీలక వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​..
మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​..

మచ్​ అవైటెడ్​ ఫేస్​లిఫ్ట్స్​లో మారుతీ సుజుకీ డిజైర్​ ఒకటి. ఈ డిజైర్ ఫేస్​లిఫ్ట్ సబ్-కాంపాక్ట్ సెడాన్ 2024 అక్టోబర్​లో అరంగేట్రం చేయనుందని సమాచారం. డిజైర్​కి సరికొతత లుక్స్​, ఫీచర్స్​ ఇచ్చి.. ఈ సెగ్మెంట్​ని రివైవ్​ చేసేందుకు మారుతీ సుజుకీ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది.. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​కి సంబంధించిన లీక్​డ్​ ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​..

డిజైర్ ప్రస్తుతం భారతదేశంలో అన్ని సెగ్మెంట్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్​గా నిలిచింది. పెట్రోల్, సీఎన్జీ వర్షెన్లలో లభిస్తుంది. దీని ధర రూ .6.57 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

తాజా స్పైషాట్ వీడియో రాబోయే డిజైర్ ఫేస్​లిఫ్ట్ సెడాన్ ఎక్స్​టీరియర్, ఇంటీరియర్స్​ని లీక్ చేసింది. కొత్త ఫ్రంట్ ఫేస్, అల్లాయ్ వీల్స్​తో సహా ఈ సెడాన్​లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లు, ఎలిమెంట్స్ పరిచయంతో సెడాన్ అప్డేటెడ్ క్యాబిన్​ని ఫొటోలు కూడా లీక్​ అయ్యాయి.

సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్​లో హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి కార్లకు మారుతీ సుజుకీ డిజైర్​ పోటీనిస్తుంది.

మారుతీ సుజుకీ డిజైర్ 2024: ఎక్స్​టీరియర్ మార్పులు..

కొత్త డిజైర్ సెడాన్ కొత్త గ్రిల్​తో కూడిన (రీడిజైన్ చేసిన) ఫ్రెంట్ ఫేస్​తో వస్తుంది. ఈ సెడాన్ తన రౌండ్​ అట్రాక్షన్​ని వదులుకుని, పదునైన లుక్స్​తో ఫ్రెంట్​ ఫేస్​ని పొందుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన కొత్త స్విఫ్ట్​లో కనిపించే డిజైన్ లాంగ్వేజ్​కు ఇది చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త డిజైర్ బాడీ అంతా బలమైన క్యారెక్టర్ లైన్లు, డీఆర్ఎల్స్​తో పదునైన ఎల్​ఈడీ హెడ్​లైట్ యూనిట్లు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, రీడిజైన్ చేసిన టెయిల్​లైట్లు, ఎలక్ట్రిక్ సన్​రూఫ్ కలిగి ఉంది.

మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్​లిఫ్ట్​: ఇంటీరియర్ అప్​డేట్స్..

మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్​లిఫ్ట్​ క్యాబిన్ డ్యూయెల్-టోన్ థీమ్, రీ-డిజైన్డ్​ డ్యాష్​బోర్డ్​తో వస్తుంది. కార్ల తయారీదారు ఫ్లోటింగ్ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్​ని ప్రవేశపెట్టనుంది. బహుశా కొత్త స్విఫ్ట్ లోపల ఉపయోగించిన అదే సెటప్​ ఇందులో ఉండొచ్చు. డ్రైవర్ డిస్​ప్లే సెమీ డిజిటల్​గా ఉంటుంది. డిజైర్ 2024లో 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, వెనుక కూర్చున్న ప్రయాణీకుల కోసం ఏసీ వెంట్స్ వంటి ఇతర ఫీచర్లు ఇందులో రావొచ్చు.

మారుతీ సుజుకీ డిజైర్ 2024: ఇంజిన్..

కొత్త స్విఫ్ట్​తో ఇండియాలో అరంగేట్రం చేసిన కొత్త జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్​ని ఇప్పుడు మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​లో సంస్థ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 1.2-లీటర్, 3 సిలిండర్​ పెట్రోల్ యూనిట్​ని 5-స్పీడ్ మేన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్​బాక్స్​తో కనెక్ట్​ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారుగా 80బీహెచ్​పీ పవర్, 112ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం ఇవి లీక్స్​ మాత్రమే అని గుర్తించాలి. లాంచ్​ సమయానికి ఇతర వివరాలపై స్పష్టత వస్తుంది.

సంబంధిత కథనం