తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Netflix : అలర్ట్​- ఈ యాపిల్​ గ్యాడ్జెట్స్​కి నెట్​ఫ్లిక్స్​ సపోర్ట్​ చేయదు! కారణం ఏంటంటే..

Netflix : అలర్ట్​- ఈ యాపిల్​ గ్యాడ్జెట్స్​కి నెట్​ఫ్లిక్స్​ సపోర్ట్​ చేయదు! కారణం ఏంటంటే..

Sharath Chitturi HT Telugu

16 September 2024, 13:35 IST

google News
  • Netflix iphone news : యాపిల్​ గ్యాడ్జెట్స్​కి సంబంధించి నెట్​ఫ్లిక్స్​ కీలక ప్రకటన చేసింది. పలు యాపిల్​ గ్యాడ్జెట్స్​కి సపోర్ట్​ ఇవ్వడం నిలిపివేస్తున్నట్టు నెట్​ఫ్లిక్స్​ ప్రకటించింది. ఫలితంగా ఆయా గ్యాడ్జెట్స్​లో ఇక నుంచి నెట్​ఫ్లిక్స్​ అప్డేట్స్​ నిలిచిపోతాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

అలర్ట్​- ఈ యాపిల్​ గ్యాడ్జెట్స్​కి నెట్​ఫ్లిక్స్​ ఇక సపోర్ట్​ చేయదు!
అలర్ట్​- ఈ యాపిల్​ గ్యాడ్జెట్స్​కి నెట్​ఫ్లిక్స్​ ఇక సపోర్ట్​ చేయదు! (Netflix)

అలర్ట్​- ఈ యాపిల్​ గ్యాడ్జెట్స్​కి నెట్​ఫ్లిక్స్​ ఇక సపోర్ట్​ చేయదు!

ప్రముఖ ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ ‘నెట్​ఫ్లిక్స్’ని వాడుతున్న యాపిల్​ యూజర్స్​కి అలర్ట్​! ఓవైపు ఐఓఎస్​ 18 లాంచ్​ అవుతున్న సమయంలో, మరోవైపు నెట్​ఫ్లిక్స్​ కీలక ప్రకటన చేసింది. ఐఓఎస్​ 16 ఆపరేటంగ్​ సిస్టెమ్​పై పనిచేసే ఐఫోన్స్​, యాపిల్​ డివైజ్​లకు సపోర్ట్​ ఇవ్వడం నిలిపివేస్తున్నట్టు నెట్​ఫ్లిక్స్​ సంస్థ ప్రకటించింది. థర్డ్​ జనరేషన్​ యాపిల్ టీవీకి మద్దతును నిలిపివేయాలని సంస్థ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

ఐఓఎస్ 16 వాడుతున్న యాపిల్​ డివైజ్​లలో కనిపించే సందేశంలో 'నెట్​ఫ్లిక్స్ యాప్​ని అప్డేట్ చేశాం. తాజా వర్షెన్ ఉపయోగించడానికి, ఐఓఎస్ 17 లేదా తరువాతి సాఫ్ట్​వేర్​ని ఇన్​స్టాల్​ చేయండి," అని ఉంది. ఐఓఎస్ 16 యూజర్లు ప్రస్తుతానికి ఈ యాప్​ను వాడుకోవచ్చు కానీ భవిష్యత్తులో వచ్చే అప్డేట్స్ ఆగిపోతాయి. అంటే కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్​లు లేదా సెక్యూరిటీ ప్యాచ్​లు అప్డేట్​ అవ్వవు!

ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే నెట్​ఫ్లిక్స్ యూజర్లకు యాప్ పనితీరులో అంతరాయం ఏర్పడనుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో నెట్​ఫ్లిక్స్​ లేదా యాపిల్ ప్రకటించలేదు. కానీ పాత పరికరాలలో యాప్ పనిచేయకపోవడం ఖాయం!

ఇదీ చూడండి:- iOS 18 release date : ఈ ఐఫోన్స్​కి మాత్రమే ఐఓఎస్​ 18 అప్డేట్​! లిస్ట్​లో మీ గ్యాడ్జెట్​ ఉందా?

ఈ గ్యాడ్జెట్స్​లో నెట్​ఫ్లిక్స్​ సపోర్ట్​ ఉండదు..!

ఈ జాబితాలో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐప్యాడ్ ప్రో ఫస్ట్ జనరేషన్, ఐప్యాడ్ 5 ఉన్నాయి. ఈ డివైజ్​లను ఐఓఎస్ 17కు అప్​గ్రేడ్ చేయలేం, అందువల్ల నెట్​ఫ్లిక్స్ యాప్ భవిష్యత్తు అప్డేట్​లు అందవు. యాపిల్ ఐఫోన్ ఎక్స్​ను వింటేజ్ ఉత్పత్తిగా గుర్తించింది. అంటే ఇది విడిభాగాల లభ్యతను బట్టి యాపిల్ స్టోర్లు, అధీకృత సర్వీస్ ప్రొవైడర్లలో మరమ్మతులకు మరో రెండు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది.

నెట్​ఫ్లిక్స్ వాడకాన్ని కొనసాగించాలనుకుంటే.. ఈ డివైజ్​లు ఉన్న వినియోగదారులు కొత్త ఫోన్ లేదా టాబ్లెట్​ను కొనుగోలు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ టీవీలకు యాప్​ స్టోర్​లో నెట్​ఫ్లిక్స్ యాప్ అందుబాటులో ఉంది.

సెప్టెంబర్ 16న ఐఓఎస్ 18 లాంచ్ కావడంతో, ప్రభావిత డివైజ్​ల వినియోగదారులు నెట్​ఫ్లిక్స్, ఇతర యాప్​లతో అనుకూలతను కొనసాగించడానికి కొత్త మోడళ్లకు అప్​గ్రేడ్ చేసుకోవడాన్ని పరిశీలించవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్​గా ఉండటం, తద్వారా అధిక భద్రత పొందడానికి నెట్​ఫ్లిక్స్​ తీసుకున్న తాజా నిర్ణయం ఉపయోగపడుతుంది.

తదుపరి వ్యాసం