Netflix plans : నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లకు షాక్..! త్వరలోనే భారీగా పెరగనున్న సబ్స్క్రిప్షన్ ధరలు!
17 October 2023, 6:12 IST
- Netflix plans : నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. తన సబ్స్క్రిప్షన్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఓ ప్రకటన వెలువడొచ్చు.
త్వరలోనే భారీగా పెరగనున్న సబ్స్క్రిప్షన్ ధరలు
Netflix plans hike : మీరు నెట్‌ఫ్లిక్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే మీకు ఒక షాకింగ్ వార్త! ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు చెందిన సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు త్వరలోనే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎంత పెరుగుతాయి..?
ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. పాస్వర్డ్- షేరింగ్‌ను నియంత్రించడంపైనే అధికంగా దృష్టిపెట్టింది నెట్‌ఫ్లిక్స్. అందుకే ఇప్పటివరకు ప్లాన్స్ ధరలను పెంచలేదు. అయితే.. ఈ పాస్వర్డ్ షేరింగ్‌ని కట్ చేయడంతో గత త్రైమాసికంలో సంస్థ.. 6 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను వెనకేసుకుందట!
ఇక ఇప్పుడు.. యాడ్-ఫ్రీ ఆప్షన్స్‌లోని ప్లాన్స్‌కు చెందిన ధరలను పెంచే యోచనలో నెట్‌ఫ్లిక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో సంస్థ.. తన త్రైమాసిక ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఫలితాలతో పాటు ధరల పెంపును కూడా ప్రకటించే అవకాశం ఉందని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ.. తన నివేదికలో పేర్కొంది.
Netflix plans increase : వాల్ట్ డిస్నీ వంటి అనేక ఓటీటీ సంస్థలు.. ఈ ఏడాదిలో ఇప్పటికే అనేకమార్లు ధరలను పెంచేశాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఇంకా ప్రైజ్ హైక్ తీసుకోలేదు. 100 మిలియన్ వ్యూవర్స్‌ని సంపాదించుకోవాలన్న టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్లింది.
అయితే.. ఇలా యాడ్ ఫ్రీ ప్లాన్స్‌కు చెందిన ధరలను పెంచితే.. యూజర్లు యాడ్ ఆధారిత ప్లాన్స్‌కు షిఫ్ట్ అవుతారని సంస్థ భావిస్తోంది. నిజంగా ఇదే జరిగితే.. సంస్థకు ఇక పండుగే! కమర్షియల్గానూ సంస్థ భారీ మొత్తంలో రెవెన్యూను సంపాదించుకోవచ్చు.
Netflix subscription plans hike : ప్రస్తుతం.. స్టాండర్డ్ యాడ్-ఫ్రీ ప్లాన్స్ ధర నెలకు 15.49 డాలర్లుగాను.. యాడ్స్‌ను సపోర్ట్ చేసే ప్లాన్స్ ధర నెలకు 6.99డాలర్లుగాను ఉంది. పాస్వర్డ్ షేరింగ్‌ను నియంత్రించిన తర్వాత.. చాలా మంది కొత్త సబ్స్క్రైబర్లు.. యాడ్-ఫ్రీ ప్లాన్స్వైపే మొగ్గుచూపారు.
ఇక ఇంతకాలం స్ట్రైక్‌లో ఉన్న హాలీవుడ్ రైటర్స్ కూడా ఇప్పుడు తిరిగి పనిలోకి వస్తున్నారు. మంచి మంచి కంటెంట్ వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు. ఈ సమయంలోనే ప్లాన్స్ ధరలను పెంచితే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయి?
నెట్‌ఫ్లిక్స్ మూడో త్రైమాసిక (ఆగస్ట్-అక్టోబర్) ఫలితాలపై మార్కెట్ వర్గాలో భారీ అంచనాలే ఉన్నాయి. రెవెన్యూ 7.7శాతం వృద్ధిచెంది 8.54 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు.