Narayana Murthy : 4 నెలల మనవడికి రూ. 240 కోట్ల ‘గిఫ్ట్’- యంగెస్ట్ మిలియనీర్ అయిపోయాడు!
19 March 2024, 7:24 IST
Narayana Murthy gifts grandson : నారాయణ మూర్తి.. తన మనవడికి రూ. 240 కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చారు! అదేంటంటే..
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి
Narayana Murthy Infosys latest news : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తన మనవడికి ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది! నారాయణ మూర్తి ఇచ్చిన ఆ గిఫ్ట్‌తో.. ఆ 4 నెలల బాలుడు.. యంగెస్ట్ మిలియనీర్ అయిపోయాడు. ఇంతకీ ఇన్ఫోసిస్ ఫౌండర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటారా..
మనవడికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గిఫ్ట్..
తన మనవడు, 4 నెలల ఎకాగ్రహ్ రోహన్ మూర్తికి 15,00,000 ఇన్ఫోసిస్ షేర్లు రాసిచ్చారు నారాయణ మూర్తి. అంటే సంస్థలో అది 0.4శాతం. కాగా.. ఈ ఇన్ఫోసిస్ షేర్ల మొత్తం విలువ రూ. 240 కోట్లు! అంటే.. నాలుగు నెలల వయస్సులోనే ఆ బాలుడు కోటీశ్వరుడైపోయాడు.
Ekagrah Rohan Murthy Infosys : ఆఫ్ మార్కెట్ ట్రేడ్‌లో ఈ ట్రాన్సాక్షన్‌ని పూర్తి చేశారు నారాయణ మూర్తి. ఈ ట్రాన్సాక్షన్ తర్వాత.. ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తి స్టేక్.. 0.40 శాతం నుంచి 0.36 శాతానికి పడిపోయింది. ఆయన దగ్గర ఇంకా సుమారు 1.51 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి.
నారాయణ మూర్తి ఫ్యామిలీ..
ఇండియాలో రెండో అతిపెద్ద టెక్ సంస్థగా కొనసాగుతోంది ఇన్ఫోసిస్. ఈ సంస్థ ఫౌండర్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తిల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా.. వీరి కుమారుడు రోహణ మూర్తికి అపర్ణ కృష్ణన్‌తో పెళ్లి జరిగింది. 2023 నవంబర్‌లో వీరికి బాబు పుట్టాడు. అతని పేరు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి అని పెట్టారు. సంసృతంలో ఏకాగ్రహ్ అంటే ఫోకస్!
Infosys share price target : ఏకాగ్రహ్ మూర్తి.. నారాయణ మూర్తి- సుధా మూర్తిలకు మూడో గ్రాండ్చైల్డ్. వారి కూతురు అక్షతా మూర్తి (బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య)కి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు.
ఇక సుధా మూర్తిని ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ప్రకటించింది బీజేపీ. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ తర్వాత.. ఆమె ఎంపీగా ప్రమాణం చేశారు.
ఇన్ఫోసిస్ని వదిలేసిన రోహన్ మూర్తి..!
Rohan Murthy story : ఏదైనా బిజినెస్ క్లిక్ అయితే.. అది తరువాతి తరం వారు చూసుకోవడం సాధారణమైన విషయం. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి.. ఇందుకు పూర్తిగా భిన్నం! ఆయన కూడా తన తండ్రి మార్గంలో నడుస్తూ, ఇన్ఫోసిస్ని వదిలేసి, తన కలను నెరవేర్చుకునేందుకు సొంతంగా ఒక కంపెనీని పెట్టి సక్సెస్ సాధించారు. కొన్నేళ్ల క్రితం.. ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు రోహన్ మూర్తి. కానీ ఆ పదవికి గుడ్ బై చెప్పి.. సొరొకొ అనే ఓ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీని ప్రారభించారు. ఏఐ సోర్స్‌ని వాడుకుని ఆటోమెషన్ పనులు చేస్తుంది ఈ సంస్థ. సొరొకోకు సీటీఓగా పనిచేస్తున్నారు రోహన్ మూర్తి. 2022లో ఈ కంపెనీ సుమారు రూ. 150 కోట్ల ఆదాయాన్ని సృష్టించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.